మోడీ పాపాలన్నీ పుణ్యస్నానంతో తొలిగిపోతాయా ?

  • Published By: venkaiahnaidu ,Published On : February 25, 2019 / 02:36 PM IST
మోడీ పాపాలన్నీ పుణ్యస్నానంతో తొలిగిపోతాయా ?

పవిత్ర త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం చేయగానే  ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలు,ద్రోహాలు,ఇతర తప్పులకు సంబంధించిన పాపాలన్నీ తొలిగిపోతాయా అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని మోడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం(ఫిబ్రవరి-25,2019) ట్విట్టర్ వేదికగా మాయావతి విమర్శలు గుప్పించారు.  నోట్లరద్దు,జీఎస్టీ,కాస్టిజం, మతతత్వంతో కూడిన నియంతృత్వ పాలనతో తమ జీవితాలను భాధాకరంగా మార్చిన బీజేపీని  ప్రజలు అంత సులభంగా క్షమించడం సాధ్యంకాదని ఆమె అన్నారు. 

మోడీ ప్రభుత్వం రైతులు, దినసరి కూలీల మధ్య తేడాను మోడీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. కేంద్రప్రభుత్వం రైతుల కోసం అమలుచేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా నెలకు ఇస్తున్న రూ.500లు రోజువారీ కూలీలకు అందితే ఉపయోగంగా ఉంటుంది కానీ రైతులకు ఏ మాత్రం ఉపయోగం ఉండదని అన్నారు. రైతులకు కావాల్సింది పంటకు గిట్టుబాటు ధర అని, అది కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు.