Amit Shah: నక్సలిజాన్ని తుడిచేస్తాం అంటూ ఛత్తీస్ ఘడ్ కు పయనమైన షా

అస్సాంలో మూడవ దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. మూడు దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు దశల్లో 86 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ఏప్రిల్ 6న 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా అస్సాం వెళ్లారు.

Amit Shah: నక్సలిజాన్ని తుడిచేస్తాం అంటూ ఛత్తీస్ ఘడ్ కు పయనమైన షా

Will Take Our Fight Against Naxalites To The End Amit Shah

Amit Shah: అస్సాంలో మూడవ దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. మూడు దశల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రెండు దశల్లో 86 స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ఏప్రిల్ 6న 40 స్థానాలకు పోలింగ్ జరగనుంది. చివరిదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా అస్సాం వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న జలుక్బరి నియోజకవర్గంతోపాటు, భవానీపూర్ లో ర్యాలీ జరగాల్సి ఉంది.

Read:kamal haasan: రాజకీయ జీవితానికి అడ్డంకిగా మారితే సినిమాను వదిలేస్తా – కమల్ హాసన్

అయితే ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సల్స్ కు మధ్య కాల్పులు జరగడంతో అమిత్ షా తన సమావేశం రద్దు చేసుకొని వెంటనే ఢిల్లీ వచ్చేశారు. కాగా ఈ ఎదురు కాల్పుల్లో 23 మంది CRPF జవాన్లు మృతి చెందారు. నక్సల్ వైపు కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. ఇక ఈ విషయంపై అమిత్ షా మీడియాతో మాట్లాడారు.. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. జవాన్లకు నివాళి అర్పించారు.

మృతుల సంఖ్య స్పష్టంగా తెలియలేదని వివరించారు. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. నక్సల్స్ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని షా తెలిపారు. ఇక షా ఢిల్లీలోని తన నివాసంలో ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, డైరెక్టర్ ఐబి అరవింద్ కుమార్, సీనియర్ సిఆర్పిఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

ఇక ఇదిలా ఉంటే ఛత్తీస్ ఘడ్ సీఎం ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. సొంత రాష్ట్రంలో బలగాలపై దాడి జరిగితే ఆ రాష్ట్ర సీఎం రాష్ట్రానికి తిరిగి రాకుండా అస్సాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దాడి జరిగిన విషయం తెలిసిన తర్వాత కూడా ఆయన రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. కాగా భూపేష్ తీరుపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది.

జవాన్ల ప్రాణాలకంటే బాగెల్ కు ఎన్నికల ప్రచారమే ముఖ్యమనిపించిందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. కాగా అస్సాంలోని బొంగైగావ్, బార్పేట జిల్లాల్లో రెండు ర్యాలీలలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎఐసిసి పరిశీలకుడిగా ఉన్న బాగెల్ ఈ రెండు ర్యాలీల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం ఛత్తీస్ ఘడ్ కు పయనమైయ్యారు.

ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సందర్శించనున్నారు. అనంతరం ఆయన కాల్పుల్లో గాయపడిన జవాన్లను పరామర్శిస్తారు.