ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా?

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో సీఎం త్రివేందసింగ్ రావత్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం.

ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా?

Trivendra Rawat వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో సీఎం త్రివేందసింగ్ రావత్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం గవర్నర్ బేబి మౌర్యని కలిసి రావత్ తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు సమాచారం. అయితే,ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్ఠానాన్ని కలిసిన మరుసటి రోజే రావత్ రాజీనామా వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సీఎం రావత్ నాయకత్వంపై రాష్ట్ర బీజేపీ నేతల్లో కొంతకాలంగా అసంతృప్తి నెలకొన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రావత్ వ్యవహార శైలి, కేబినెట్ కూర్పులో జాప్యం పట్ల 20మంది వరకు ఎమ్మెల్యేలు,పలువురు మంత్రులు అసంతృప్తిగా ఉండటం ఈ మొత్తం వ్యవహారానికి కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా సీఎంపై పార్టీ హైకమాండ్ కు కూడా వీరు ఫిర్యాదు చేశారు.

అయితే ఉత్తరాఖండ్ అధికార పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నియామకమైన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దుష్యంత్​ కుమార్ గౌతమ్,ఉత్తరాఖండ్​ ఇన్ చార్జ్ గా ఉన్న ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్​ సింగ్ నేతృత్వంలో శనివారం డెహ్రాడూన్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ​ డెహ్రాడూన్ లో అత్యవసరంగా నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో దుష్యంత్, రమణ్​ సింగ్​ తో పాటు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, మాజీ సీఎం విజయ్ బహుగుణ,నైనిటాల్ ఎంపీ అజయ్ భట్, రాజ్యసభ ఎంపీ నరేష్ భన్సల్,తెహ్రీ మాలా రాజ్యలక్ష్మి,రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ అజేయ కుమార్,రాష్ట్ర మంత్రులు మదన్ కౌశిక్,ధన్ సింగ్ రావత్ తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకుపైగా సాగిన ఈ కోర్ కమిటీ సమావేశంలో ఉత్తరాఖండ్​లో పరిస్థితులపై చర్చించారు.

ఛత్తీస్‌ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి,ఉత్తరాఖండ్​ ఇన్ చార్జ్ రమణ్​ సింగ్… కోర్ గ్రూపులోని ప్రతి సభ్యుడితో విడి విడిగా మాట్లాడి వారి ఫీడ్ బ్యాక్ ను తీసుకున్నారు. అంతేకాకుండా సుమారు 40 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లి, తరువాత డెహ్రాడూన్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. కోర్ కమిటీ సమావేశం తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ దుష్యంత్​ కుమార్ గౌతమ్,ఉత్తరాఖండ్ వ్యవహారాల భాధ్యుడు రమణ్ సింగ్ లు అధిష్ఠానానికి నివేదికను అందజేశారు. నివేదిక సమర్పించిన నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం నుంచి సీఎం త్రివేంద్రసింగ్ రావత్ కి​ ఢిల్లీకి రావాల్సిందిగా సోమవారం పిలుపు వచ్చింది. దీంతో సోమవారం సీఎం రావత్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ నుంచి తిరిగి ఇవాళ డెహ్రాడూన్ చేరుకున్న సీఎం..సాయంత్రం 4గంటలకు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. సీఎం పదవికి రాజీనామా చేసేందుకే ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం.

ఇక,త్రివేవంద్రసింగ్ రావత్ స్థానంలో సీఎం బాధ్యతలను ప్రస్తుతం మంత్రిగా ఉన్న ధన్ సింగ్ రావత్ చేపట్టనున్నట్లు సమాచారం. ఉదయ్ సింగ్ నగర్ జిల్లాలోని కతిమా అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పుష్కర్ సింగ్ ధమి డిప్యూటీ సీఎం అవబోతున్నట్లు సమాచారం.