Wipro Layoffs : విప్రోలో మళ్లీ లేఆఫ్.. వంద మందికిపైగా ఉద్యోగులు ఇంటిబాట ..

ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 100 మందికిపైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారే ఉన్నట్లు ఐటీ దగ్గజం విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఒక టీమ్ లీడర్, టీమ్ మేనేజర్ కూడా తొలగించబడినట్లు తెలిపింది. అయితే, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరిగిందని, అమెరికన్ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని విప్రో తెలిపింది.

Wipro Layoffs : విప్రోలో మళ్లీ లేఆఫ్.. వంద మందికిపైగా ఉద్యోగులు ఇంటిబాట ..

Wipro Layoffs

Wipro Layoffs : ఆర్థిక మాంద్యం భయంతో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో ఇప్పటికే తమ కంపెనీలో పనిచేసే కొందరు ఉద్యోగులపై వేటు వేసింది. మరోసారి మరికొందరిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. దాదాపు 120 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఈ తొలగింపు ప్రక్రియ భారతదేశంలో లేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అందరూ అమెరికాకు చెందిన వారే ఉన్నారు. కంపెనీపై భారాన్ని తగ్గించేందుకు ఆ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.

Zoom layoffs: ప్రెసిడెంట్‌కు షాకిచ్చిన ‘జూమ్’.. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడి తొలగింపు

ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 100 మందికిపైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారే ఉన్నట్లు ఐటీ దగ్గజం విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఒక టీమ్ లీడర్, టీమ్ మేనేజర్ కూడా తొలగించబడినట్లు తెలిపింది. అయితే, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరిగిందని, అమెరికన్ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని విప్రో తెలిపింది. తొలగించిన ఉద్యోగులు ప్రస్తుతం కంపెనీలోనే పనిచేస్తున్నారని, మే నెలలో వారు విధుల నుంచి వైదొలుగుతారని, అప్పటి వరకు కంపెనీ జీతం, ఇతర సౌకర్యాలను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

ఇటీవల విప్రో లిమిటెడ్ కంపెనీలో తక్కువ వేతనంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఫ్రెషర్స్ ను కోరింది. ఈ మేరకు క్యాంపస్ నియామకాలను చేపట్టింది. ప్రస్తుతం విప్రో భారతదేశంలో నాల్గొవ అతిపెద్ద సాప్ట్‌వేర్ కంపెనీగా ఉంది. ఆర్థిక మాద్యం నేపథ్యంలో ఇప్పటికే ఫ్రెషర్స్‌కు జీతం తగ్గిస్తున్నట్లు, వారు సగం జీతంతో పనిచేయాలని కంపెనీ పేర్కొంది. బెంగళూరులో ఉన్న ప్రధాన కార్యాలయానికి రూ.6.5లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసిన ఉద్యోగులు తర్వాత రూ. 3.5 లక్షల వార్షిక వేతనంతో కంపెనీలో చేరాలని కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చింది.