నాటకాల రోజుకి హ్యాపీ డే : మోడీ మిషన్ శక్తి ప్రకటనపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2019 / 09:58 AM IST
నాటకాల రోజుకి హ్యాపీ డే : మోడీ మిషన్ శక్తి ప్రకటనపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతమైందంటూ బుధవారం(మార్చి-27,2019)ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా తృణముల్, ఎస్పీ పలు రాజకీయ పార్టీలు స్పందించాయి.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(DRDO)కి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.డీఆర్ డీవో పనితీరుని చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కూడా వెరీ హ్యాపీ వరల్డ్ థియేటర్ డే విషెస్ చెప్పడానికి తాను ఇష్టపడతానని మోడీపై సెటైర్లు వేస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.
Read Also : డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?

ఈ రోజు నరేంద్రమోడీ టీవీ ముందుకొచ్చి ఆకాశాన్ని చూపిస్తూ కిందిస్థాయిలోని నిరుద్యోగం,గ్రామీణ సమస్యలు,మహిళా భద్రతా వంటి ఇష్యూస్ నుంచి దేశ ప్రజలను డైవర్ట్ చేశారని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.డీఆర్ డీవో,ఇస్రో సాధించిన విజయం పట్ల అభినందనలు తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు.భారత్ ను సురక్షితంగా తయారుచేసినందుకు కృతజ్ణతలు అని తెలిపారు.ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోడీ అనంతమైన డ్రామాల్లో ఇది ఒకటని,మోడీ ప్రకటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తృణముల్ అధ్యక్షురాలు,వెస్ట్ బెంగాల్ సీఎం మమత ఆరోపించారు.

బుధవారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ…మిషన్ శక్తిలో భాగంగా అంతరిక్షంలో…భూమికి 300 కిలోమీటర్ల ఎత్తులో.. లోయర్ స్పేస్‌లో ఏ-శాట్ (యాంటీ శాటిలైట్)ను మిసైల్ ద్వారా కూల్చివేసినట్లు ప్రకటన చేశారు. ఇంత టెక్నాలజీని సాధించిన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ భారతీయుడూ గర్వించదగ్గ అంశంగా అభివర్ణించారు.కేవలం 3 నిమిషాల వ్యవధిలో మిషన్ శక్తి కంప్లీట్ అయ్యిందని తెలిపారు.ఇకపై ఎలాంటి లక్ష్యాన్ని అయినా ఛేదించగల శక్తి ఇండియాకు వచ్చినట్టేనని అన్నారు. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే సాధించిన ఘనతను భారత్ కూడా సాధించిందని గర్వంగా ప్రకటించారు స్పేస్ పవర్ దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా సూపర్ పవర్ గా మారిందని మోడీ ప్రకటించారు.
Read Also : మిషన్ శక్తి ఏంటీ.. అంతరిక్షంలో సూపర్ పవర్ ఎలా అయ్యింది