మహారాష్ట్రలో మళ్లీ 25వేలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్‌ మహారాష్ట్రను వణికిస్తోంది. వరుసగా రెండో రోజు మహారాష్ట్రలో 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం(మార్చి-19,2021) రాష్ట్రవ్యాప్తంగా 25,681 కొత్త కరోనా కేసులు,70మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు 14,400మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలో మళ్లీ 25వేలు దాటిన కరోనా కేసులు

With 25681 New Covid 19 Cases Maharashtra Records 25k Cases Two Days In A Row1

Maharashtra కరోనా వైరస్‌ మహారాష్ట్రను వణికిస్తోంది. వరుసగా రెండో రోజు మహారాష్ట్రలో 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, గురువారం రాష్ట్రంలో నమోదైన 25,853కన్నా కొంచెం తక్కువగా ఇవాళ కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం(మార్చి-19,2021) రాష్ట్రవ్యాప్తంగా 25,681 కొత్త కరోనా కేసులు,70మరణాలు నమోదయ్యాయి. 14,400మంది ఇవాళ వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ముంబై,నాగ్‌పూర్‌లో తాజాగా నమోదైన కేసులు కలవరపరుస్తున్నాయి. ముంబైలో ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3062 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 10మంది మృతిచెందారు. 1334మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ముంబైలో మొత్తంగా 3,55,897 కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,23,281మంది కోలుకోగా,11,565మంది మృతి చెందారు. ముంబైలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,140గా ఉంది.

ఇక, నాగ్‌పూర్‌లో గడిచిన 24గంటల్లోనే 3235 కొత్త కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు నాగ్‌పూర్‌లో 1,85,787 కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,55,655 మంది కోలుకోగా.. 4563మంది మరణించారు. ప్రస్తుతం నాగ్ పూర్ లో 25,569 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక, మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,80,83,977 శాంపిల్స్‌ పరీక్షించగా.. 24,22,021 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 21,89,965 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 53,208మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,77,560 యాక్టివ్ కేసులు ఉన్నాయి.