5వ తరగతి నుంచి సీపీఎంలో పనిచేసిన 21ఏళ్ల ఆర్య.. నగర మేయర్‌‌‌గా ఎలా ఎదిగిదంటే?

5వ తరగతి నుంచి సీపీఎంలో పనిచేసిన 21ఏళ్ల ఆర్య.. నగర మేయర్‌‌‌గా ఎలా ఎదిగిదంటే?

Thiruvananthapuram mayor : బాల్యంలో 5వ తరగతి నుంచే సీపీఎంతో పనిచేస్తూ.. నగర మేయర్ స్థాయి వరకు ఎదిగిందో  21ఏళ్ల యువతి. ఒకవైపు తన చదువును కొనసాగిస్తూనే మరోవైపు పార్టీ కోసం నిరంతరాయంగా పనిచేస్తూ వచ్చింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నగర మేయర్ పదవిని అందుకోబోతోంది. ఆమే కేరళాకు చెందిన ఆర్యా రాజేంద్రన్.. తిరువనంతపురం మేయర్‌ పదవికి అర్హత సాధించింది. డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్ స్టూడెంట్.. రెండో సంవత్సరం చదువుతోంది. ఆర్య తండ్రి  ఒక ఎలక్ట్రీషియన్.. బాల్యం నుంచే సీపీఎం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చింది. ఇప్పుడు అదే ఆమెను నగర కార్పొరేషన్ మేయర్‌ను చేస్తోంది. కేరళ తిరువనంతపురం కార్పొరేషన్ జిల్లా సచివాలయం రాజేంద్రన్ ను మేయర్ చేయాలని నిర్ణయించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఎం) ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ శనివారమే అధికారిక ప్రకటన రానుంది.

బాల్యం నుంచే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ ఆర్య.. తన విద్యాజీవితాన్ని మాత్రం అలానే కొనసాగించింది. ఒకవైపు స్కూలు, కాలేజీ జీవితం.. మరోవైపు రాజకీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. కార్మెల్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. తిరువనంతపురంలో నెలకు రూ.6 వేలు అద్దె చెల్లించే చిన్న ఇంట్లో ఆర్యా ఫ్యామిలీ నివసిస్తోంది. కుటుంబ జీవనం కష్టంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాలపై తన ఆసక్తిని వదులుకోలేదు. అదే ఉత్సాహంతో కేరళలోని దాదాపు అన్ని జిల్లాల్లో పర్యటించింది. తండ్రి అనారోగ్యంతో మృతిచెందడంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైంది. దాంతో తన సోదరుడు పనికోసం మరో ప్రాంతానికి వలస వెళ్లాడు. కుటుంబ పరిస్థితులు అనుకూలించక పోయినా ఆర్యా రాజేంద్రన్.. ఏమాత్రం అదైర్య పడలేదు. కేరళలో కరోనా సమయంలోనూ తనవంతు సేవలు చేసి కేరళ రోల్ మోడల్‌గా టాప్ జాబితాలో నిలిచింది.

ముదవణ్మగుల్ వార్డులో జరిగిన స్థానిక ఎన్నికల్లో రాజేంద్రన్ 2,872 ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 549 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దాంతో ఆర్యను నగర మేయర్ చేయాలని ప్రతిపాదించారు. మేయర్ గా ఆమోదం పొందితే.. దేశంలోనే అతి పిన్న వయస్కులో 21ఏళ్ల ఆర్య నగర మేయర్ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో LDF పార్టీ 100 వార్డుల్లో 51 వార్డులు గెలిచింది. ఆల్ సెయింట్ కాలేజీలో రెండవ సంవత్సరం డిగ్రీ విద్యార్థి. తమది పార్టీ కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే ఆర్యకు రాజకీయాలపై ఆసక్తి పెరిగిందని ఆమె తండ్రి కేఎం రాజేంద్రన్ తెలిపారు. తల్లి శ్రీలత ఎల్ ఐసీ ఏజెంట్ గా పనిచేస్తున్నారు. 5వ తరగతి నుంచే సిపిఎం కార్మికురాలిగా పనిచేస్తున్న ఆర్య.. ప్రస్తుతం సీపీఎం సపోర్టర్ ‘బాలసాంగోమ్’ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. SFI కేరళ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నారు.

మేయర్ హోదాలో ప్రజా సేవతో పాటు చదువును కూడా కొనసాగిస్తానని ఆర్య చెప్పారు. కేరళలోని స్థానిక సంస్థలలో సగం సీట్లు మహిళలకు కేటాయించారు. కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ, ఆర్య తన విద్యా జీవితాన్ని కొనసాగించింది. తన కొత్త నియామకాన్ని చేపట్టిన తర్వాత క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కాలేనని ఆర్య భావిస్తోంది. చదువు కొనసాగించేందుకు తనకు ఉపాధ్యాయులు, స్నేహితులు అందరూ సాయపడతారని భావిస్తున్నానని చెప్పారు.