Ramadan: మాస్క్‌ ఉంటేనే మసీదులోకి

ఆకాశంలో నెలవంక కనిపించడంతో సంప్రదాయబద్ధంగా పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషా నమాజు నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.

Ramadan: మాస్క్‌ ఉంటేనే మసీదులోకి

Ramadan

Ramadan: ఆకాశంలో నెలవంక కనిపించడంతో సంప్రదాయబద్ధంగా పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైంది. ఈ మేరకు మంగళవారం రాత్రి మక్కా మసీదులో ఇషా నమాజు నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. అనంతరం మక్కా మసీదు కతీబ్‌ రిజ్వాన్‌ ఖురేషీ తరావీ పవిత్ర ఖురాన్‌ను పఠించారు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడం మక్కా మసీదును రంగు రంగుల లైట్లతో అలంకరణతో నిండిపోయింది.

బుధవారం నుంచి ఇఫ్తార్ విందు ప్రారంభం కానుంది… విందుకు వచ్చేవారికి పంచేందుకు వెయ్యి కిలోల ఖర్జురాలను సిద్ధం చేశారు. ఇక కరోనా జాగ్రత్తల గురించి మక్కా మసీదు సూపరింటెండెంట్‌ ఎం.ఎ.ఖాదర్‌ సిద్దిఖీ ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని మసీదులోకి రావాలని తెలిపారు.

మాస్క్ లేని వారిని పోలీసులు మసీద్ లోకి అనుమతించరని పేర్కొన్నారు. విందు, నమాజ్ లో పాల్గొనే సమయంలో సామాజిక దూరం పాటించాలని తెలిపారు. మసీదుకు వచ్చేవారు తమ ఇళ్ల వద్దే వజూ చేసుకొని వెంట జానిమాజ్‌లు తెచ్చుకోవాలన్నారు. రంజాన్ నెలలో మక్కా మసీదులోకి విజిటర్స్ ని అనుమతించడం లేదని తెలిపారు.

10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ళు పైబడిన వృధ్దులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొనవద్దని కోరారు.