ముఖ్య అతిథి లేకుండానే : రిపబ్లిక్ డే సంబరాలు, రామమందిరం శకటం

ముఖ్య అతిథి లేకుండానే : రిపబ్లిక్ డే సంబరాలు, రామమందిరం శకటం

Republic Day Celebrations : సంబరాల్లో దేశ సైనిక సత్తా చాటడానికి త్రివిధ బలగాలు సిద్ధమయ్యాయి. రాఫెల్ యుద్ధ విమానాలను తొలిసారిగా ఈ ఏడాది పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్‌ 30 విమానశకటాలు పరేడ్‌లో పాల్గొంటాయి. అయితే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు కరోనా ఆంక్షల మధ్య జరగనున్నాయి.

కరోనా ఆంక్షల ప్రభావంతో ఈసారి ముఖ్య అతిథి లేకుండానే గణతంత్ర వేడుకలు జరగనున్నాయ్. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రావడానికి ముందుగా అంగీకరించినప్పటికీ.. కోవిడ్ విజృంభణతో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈసారి పాఠశాల విద్యార్థులు పరేడ్‌లోఉండరు. 15ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిని ఇండియా గేట్‌ లాన్స్‌లోకి మాత్రమే అనుమతినిస్తారు. పరేడ్‌ సమయాన్ని కూడా తగ్గించారు. ఇండియా గేట్‌ దగ్గర నేషనల్‌ స్టేడియం వరకు మాత్రమే ప్రదర్శనకు అనుమతినిచ్చారు. శకటాలు మాత్రం ఎర్రకోట వరకు వెళ్తాయి. సిఆర్‌పీఎఫ్‌ సిబ్బంది నిర్వహించే మోటార్‌ సైకిల్‌ స్టంట్స్‌ కూడా ఈసారి ఉండవు.

గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్‌ ప్రాతినిధ్యం వహించబోతోంది. లేహ్‌ జిల్లాలో చారిత్రక థిక్సే మఠాన్ని ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమివ్వబోతోంది. భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 1971 భారత్‌ పాక్‌ యుద్ధ సమయంలో నావికా దళ ఆపరేషన్‌ను శకటంగా ప్రదర్శిస్తోంది.