Mumbai : మాస్క్ పెట్టుకో అన్నందుకు కాలితో తన్నిన మహిళ

ఆటోలో ఎక్కిన ఆ మహిళను అక్కడనే పని చేస్తున్న మున్సిపల్ వర్కర్ అడ్డుకుంది. మాస్క్ పెట్టుకోవాలని కోరింది.

Mumbai : మాస్క్ పెట్టుకో అన్నందుకు కాలితో తన్నిన మహిళ

Mumbai

Not Wearing Mask : మ‌హారాష్ట్రలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మాస్క్ ధ‌రించాల‌న్న త‌ప్పనిస‌రి నియ‌మం కూడా ఉంది. కానీ శుక్రవారం ఓ మ‌హిళ కాండివ‌లీ రోడ్డు మార్గంలో మాస్క్ లేకుండా కనిపించింది. ఆటోలో ఎక్కిన ఆ మహిళను అక్కడే పని చేస్తున్న మున్సిపల్ వర్కర్ అడ్డుకుంది. మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. ఆ స‌మ‌యంలో మున్సిప‌ల్ వ‌ర్కర్‌పై ఆ మ‌హిళ ఆక‌స్మికంగా దాడి చేసి చెంప చెల్లుమ‌నిపించింది.

ఆటోలో నుంచి మ‌హిళా మున్సిప‌ల్ వ‌ర్కర్‌ను కాలితో త‌న్నింది. అంతటితో ఆగకుండా ఆ వర్కర్‌పై సదరు మహిళ భీకరంగా దాడి చేసింది. జుట్టు పట్టుకుని గొడవపడుతుండటంతో అక్కడున్న వారు వదిలివేయాలని సూచించారు. ఈ ఘ‌ట‌న మొత్తం మొబైల్ వీడియోలో చిత్రీక‌రించారు పక్కనే ఉన్న మరికొంతమంది. మాస్క్ పెట్టుకోని మ‌హిళ‌ను.. మున్సిప‌ల్ వ‌ర్కర్ కూడా వ‌ద‌ల‌లేదు.

త‌న‌ను కొడుతున్నా.. ఆ వ‌ర్కర్ మాత్రం మ‌హిళ‌ను అలాగే గ‌ట్టిగా ప‌ట్టుకుంది. మాస్క్ లేకుండా తిరిగేవాళ్లకు ముంబైలో రూ. 200 ఫైన్ వేస్తున్నారు. మున్సిప‌ల్ సిబ్బందిపై దాడి చేసిన‌ మ‌హిళ‌కు ప్రభుత్వం ఎటువంటి శిక్ష విధిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)