Woman Thrashed : వామ్మో.. ఇదేం కొట్టుకోవడం రా నాయనా.. ఒక అబ్బాయి కోసం ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలు

ఒక అబ్బాయి కోసం ఆరుగురు అమ్మాయిలు కొట్టుకున్నారు. కొట్టుకోవడం అంటే.. అలా ఇలా కాదు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దారుణంగా ఫైట్ చేశారు. జట్లు పట్టుకుని, కాళ్లతో కాళ్లతో మరీ తన్నుకున్నారు. దుస్తులు కూడా చింపుకున్నారు.

Woman Thrashed : వామ్మో.. ఇదేం కొట్టుకోవడం రా నాయనా.. ఒక అబ్బాయి కోసం ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలు

Woman Thrashed : బీహార్ లోని సోనేపూర్ లో అమ్మాయిలు ఘర్షణ పడ్డారు. ఆరుగురు అమ్మాయిలు కొట్టుకున్నారు. కొట్టుకోవడం అంటే.. అలా ఇలా కాదు.. పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దారుణంగా ఫైట్ చేశారు. జట్లు పట్టుకుని, కాళ్లతో మరీ తన్నుకున్నారు. దుస్తులు కూడా చింపుకున్నారు. ఇదంతా ఓ అబ్బాయి కోసం జరిగిన ఫైటింగ్ కావడం షాక్ కి గురి చేసే అంశం.

ఓ యువతి తన ఫ్రెండ్స్ తో కలిసి జాతరకు వచ్చింది. అదే సమయంలో జాతరలో ఆమెకు తన ప్రియుడు కనిపించాడు. అయితే, అతడి పక్కనే మరో అమ్మాయి ఉంది. దీంతో ఆ యువతి కోపం కట్టలు తెంచుకుంది. తన ప్రియుడి పక్కన ఉన్న అమ్మాయితో గొడవకు దిగింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నా లవర్ తోనే తిరుగుతావా? అంటూ ఆ అమ్మాయిపైకి దూసుకెళ్లింది. చూస్తుండగానే ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. తన లవర్ తో తిరుగుతున్న అమ్మాయిపై యువతి దాడి చేసింది. జుట్టు పట్టుకుని లాగింది. కాళ్లతో తన్నింది.

Also Read : Girl Students Fighting : వామ్మో.. వీళ్లు చదువుకునే అమ్మాయిలా? వీధి రౌడీలా? కుర్చీల కోసం ఎలా పొట్టు పొట్టు కొట్టుకున్నారో చూడండి..

ఆమెకు ఫ్రెండ్స్ కూడా సాయపడ్డారు. నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువతిని దారుణంగా కొట్టారు. అమ్మాయిల దాడిలో బాధితురాలి దుస్తులు సైతం చిరిగిపోయాయి. అయినా వారు తగ్గలేదు. కొట్టుకోవడం ఆపలేదు. అమ్మాయిల ఫైటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీళ్లసలు అమ్మాయిలేనా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. వీళ్ల ఫైటింగ్ చూసి నోరెళ్లబెడుతున్నారు. అబ్బాయిలు కూడా ఇంత దారుణంగా కొట్టుకోరేమో అని కామెంట్ చేస్తున్నారు.

Also Read : Rajasthan Chain Snatch : షాకింగ్ వీడియో.. షాపింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి చైన్ ఎలా లాక్కెళ్లాడో చూడండి..

అబ్బాయి కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న అమ్మాయిలు..