Bathing Video : స్నానం చేస్తూ కాబోయే భర్తకు వీడియో పంపాలని అనుకుంది… తర్వాత ఏమైందో తెలుసా ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే భర్తకు తనకు సంబంధించి పర్సనల్ వీడియోను పంపించాలని డిసైడ్ అయ్యింది. స్నానం చేస్తున్న వీడియోను పంపించాలని అనుకుంది. అనుకున్నట్లుగానే వీడియో తీసుకుంది. వాట్సాప్ ద్వారా పంపించాలని అనుకుంది.

Bathing Video : స్నానం చేస్తూ కాబోయే భర్తకు వీడియో పంపాలని అనుకుంది… తర్వాత ఏమైందో తెలుసా ?

Bathing Video

Woman Commits Suicide : వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు ఇతరులకు షేర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చేస్తున్న సూచనలను కొంతమంది బేఖాతర్ చేస్తున్నారు. కొన్ని సైట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, వీటిని ఉపయోగిస్తే..చాలా ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు. సరదా కోసం చేస్తూ..ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తమకు సంబంధించిన ఫొటోలు ఇతరులకు షేర్ చేసుకోవడం..అవి కాస్తా…ఇతరులకు తెలిసిపోవడం..వారు మరికొంతమందికి పంపించడంతో తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే భర్తకు తనకు సంబంధించి పర్సనల్ వీడియోను పంపించాలని అనుకుంది. అయితే..అది వికటించి ప్రాణాలు పొగొట్టుకుంది.

Read More : Water melon : ఈ కాయను తింటే హైబీపితోపాటు అధిక బరువు తగ్గొచ్చు..

వివరాల్లోకి వెళితే…

ఉజ్జయిని పరిధిలోని తోబ్రిఖేడా గ్రామంలో ఓ యువతికి ఇండోర్ కు చెందిన ఒక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. 10 రోజుల క్రితం నిశ్చితార్థం కూడా జరిగింది. ఇరువురు ఫోన్ లో మాట్లాడుకొనే వారు. కాబోయే భర్త గనుక…సరదాగా మాట్లాడేది. ఓ రోజు..స్నానం చేస్తున్న వీడియోను పంపించాలని డిసైడ్ అయ్యింది. అనుకున్నట్లుగానే వీడియో తీసుకుంది. వాట్సాప్ ద్వారా పంపించాలని అనుకుంది. ఇక్కడే పొరపాటు చేసింది. కాబోయే భర్తకు పంపించకుండా..వేరే ఫ్రెండ్ కు పంపించింది.

Read More :TTD Chairman : కరోనా నుంచి ప్రజలని కాపాడేందుకు పూజలు, బాధ్యతలు స్వీకరించిన వైవీ

అతను ఈ వీడియో విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి..ఇతరులకు షేర్ చేశాడు. ఇక ఆగుతుందా..ఒకరి నుంచి మరొకరికి…ఇలా షేర్ చేసుకున్నారు. వీడియో చూస్తూ వికృతానందం పొందారు. ఈ వీడియో ఎంతవరకు వెళ్లిందంటే..యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వరకు వెళ్లింది. దీంతో ఆ యువతిని తీవ్రంగా మందలించారు.

Read More : Dehradun : నా ‘పిలక’ పోయింది సార్..పండిట్ ఫిర్యాదు..కేసు నమోదు

దీంతో పరువు పోయిందనే బాధపడసాగింది. తనువు చాలించాలని అనుకుని విషం తాగేసింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా…ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ..చనిపోయింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సరదాగా చేయాలని అనుకున్న ఓ పని ఆమె ప్రాణాలు తీసింది.