UP : మాస్క్ లేనందుకు ఆపితే..మహిళా కానిస్టేబుళ్లను వేధించాడు..యూనిఫాంను చించాడు!

ఆకతాయిలకు బుద్ధి చెప్పే యాంటీ రోమియా స్వ్కాడ్ లో ఇద్దరు మహిళా పోలీసులు పని చేస్తున్నారు. అమ్రోహా జిల్లాలో వీరు ఓ ప్రాంతంలో ఉండగా..మాస్క్ ధరించకుండా వెళుతున్న వ్యక్తిని ఆపారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు సదరు వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

UP : మాస్క్ లేనందుకు ఆపితే..మహిళా కానిస్టేబుళ్లను వేధించాడు..యూనిఫాంను చించాడు!

No Mask

Woman Constable Molested : కరోనా..ఈ వైరస్ కు చెక్ పెట్టడానికి, వ్యాప్తి చెందకుండా ఉండటానికి మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ..కొంతమంది ఇప్పటికీ బేఖాతర్ చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రభుత్వాలు వారిపై కొరఢా ఝులిపిస్తున్నాయి. ఫైన్ లు విధిస్తున్నాయి. అయితే..కొన్ని చోట్ల మాస్క్ లేకపోవడంతో ప్రశ్నించినందుకు..దాడులు, ఘర్షణలకు దిగుతున్నారు. తాజాగా..మాస్క్ లేకుండా..ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించినందుకు…మహిళా కానిస్టేబుళ్లను వేధించాడు. అంతేగాదు..వారి యూనిఫాంను చించేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన యూపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఆకతాయిలకు బుద్ధి చెప్పే యాంటీ రోమియా స్వ్కాడ్ లో ఇద్దరు మహిళా పోలీసులు పని చేస్తున్నారు. అమ్రోహా జిల్లాలో వీరు ఓ ప్రాంతంలో ఉండగా..మాస్క్ ధరించకుండా వెళుతున్న వ్యక్తిని ఆపారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు సదరు వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహిళా కానిస్టేబుళ్లను వేధించాడు. ఓ కానిస్టేబుల్ యూనిఫాంను చించేసినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులకు సమాచారం అందుకున్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మాస్క్ లేకుండా వెళుతున్న ఈ వ్యక్తి..మహ్మద్ జైన్ గా గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.