Sun Heat : ఎండ వేడితో ఆమ్లెట్…వీడియో వైరల్

ప్రచండ భానుడి భగభగలు భయపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదవుతున్న రికార్డు ఉష్ణోగ్రతలకు ప్రజలు మలమల మాడిపోతున్నారు. వేడిని తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాగే ఖతార్ లో కూడా ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి.

Sun Heat : ఎండ వేడితో ఆమ్లెట్…వీడియో వైరల్

Egg

Sun Heat : ఎండలు బాబోయ్ ఎండలు అంటున్నారు. గిదెం ఎండలు. ఛస్తున్నాం అంటున్నారు జనాలు. ఎండలకు తాళలేక..ఇంట్లో ఉండలేక..బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డవుతున్నాయి. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో..ఓ మహిళ వీడియో రూపంలో చూపెట్టింది. ఇంటి బయటకు వెళ్లకుండానే..స్టవ్ లేకుండా..ఎండ వేడితోనే ఆమ్లెట్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ట్ స్ట్రా గ్రామ్ ద్వారా పంచుకున్నారు.

ప్రచండ భానుడి భగభగలు భయపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదవుతున్న రికార్డు ఉష్ణోగ్రతలకు ప్రజలు మలమల మాడిపోతున్నారు. వేడిని తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాగే ఖతార్ లో కూడా ఎండలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. సోషలో మీడియాలో చురుకుగా ఉండే..ghadirbenderoffical నుంచి ఓ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోలో కిటికీలో నుంచి పెనాన్ని బయటకు పెట్టారు.

అనంతరం అందులో కొద్దిగా నూనె పోసి..ఓ గుడ్డును కొట్టి అందులో వేశారు. కొద్దిసేపటి తర్వాత..ఎండ వేడికి ఆమ్లెట్ లాగా అయిపోయింది. నెటిజన్ల నుంచి భారీ స్పందనే వచ్చింది. 158,539 likes వచ్చాయి. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది.

సముద్రం నుంచి వచ్చే వేడి గాలులు వాతావరణంలో కలిసిపోయి హీట్‌డోమ్‌లా మారుతున్నాయని.. దీంతో ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయని అంటున్నారు నిపుణులు. సముద్ర ఉష్ణోగ్రతల్లో వచ్చే భారీ మార్పుల వల్లే… వేడిగాలులు వీస్తున్నాయని… ఇవి సముద్ర ఉపరితలం మీద ఉండే ఉష్ణోగ్రతలతో కలిసి.. మరింత వేడిగా మారుతున్నాయని అంచనా వేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Coaching | Health and Beauty (@ghadirbenderoffical)