అయ్యో ఘోరం జరిగిపోయింది : ఎయిడ్స్ అని తప్పుడు రిపోర్ట్.. షాక్ తో మహిళ మృతి

ఓ తప్పు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఓ తప్పు నిండు ప్రాణం తీసింది. ప్రైవేటు క్లినిక్‌ డాక్టర్ పరీక్షల తప్పుడు నిర్ధరణల(డయాగ్నోస్) కారణంగా ఒక మహిళ షాక్‌కు గురై

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 04:30 PM IST
అయ్యో ఘోరం జరిగిపోయింది : ఎయిడ్స్ అని తప్పుడు రిపోర్ట్.. షాక్ తో మహిళ మృతి

ఓ తప్పు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఓ తప్పు నిండు ప్రాణం తీసింది. ప్రైవేటు క్లినిక్‌ డాక్టర్ పరీక్షల తప్పుడు నిర్ధరణల(డయాగ్నోస్) కారణంగా ఒక మహిళ షాక్‌కు గురై

ఓ తప్పు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఓ తప్పు నిండు ప్రాణం తీసింది. ప్రైవేటు క్లినిక్‌ డాక్టర్ పరీక్షల తప్పుడు నిర్ధరణల(డయాగ్నోస్) కారణంగా ఒక మహిళ షాక్‌కు గురై చనిపోయింది. ఈ దారుణం హిమాచల్‌ ప్రదేశ్‌ లో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. రోహ్రు ప్రాంతానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో సమీపంలోని ప్రైవేట్ క్లినిక్‌ కి వెళ్లింది. ఆ క్లినిక్‌లోని డాక్టర్ ఆమెకు పరీక్షలు నిర్వహించాడు. ఏమైందో చెప్పకుండానే పరీక్షల(డయాగ్నోస్) రిపోర్ట్ ని ఆమెకిచ్చాడు. ఆ మహిళ భర్తతో కలిసి చికిత్స కోసం షిమ్లాలోని కమలానెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ప్రైవేటు క్లినిక్‌ డాక్టర్ ఇచ్చిన రిపోర్టులను ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు చూపింది. రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు.. వాటి ప్రకారం ఆమెకు ఎయిడ్స్(హెచ్‌ఐవీ) ఉందని తెలిపారు. నిర్ధారించుకోవడానికి మరోసారి పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ఎయిడ్స్ ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆ మహిళ షాక్ తింది. వెంటనే కోమాలోకి వెళ్లిపోయింది. కంగారు పడిన భర్త మెరుగైన చికిత్స కోసం భార్యని ఇందిరాగాంధీ మెడికల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం(ఆగస్టు 27,2019) ఆమె చనిపోయింది. ఈ ఘటన సంచలనమైంది. దీనిపై అసెంబ్లీలో పెద్ద గొడవ జరిగింది. బుధవారం(ఆగస్టు 28,2019) కాంగ్రెస్ నేత, రోహ్రూ ఎమ్మెల్యే లాల్ బ్రక్త ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనిపై సీఎం జైరామ్‌ ఠాకూర్‌ స్పందించారు. ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. వెంటనే దర్యాప్తు చేపట్టి నివేదికలు సమర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మహిళకు హెచ్‌ఐవీ సోకినట్లు తప్పుడు నివేదికల నిర్ధరణలతో ఆమె మృతికి కారణమైన ఆ క్లినిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Also Read : ఓనర్ గెంటేస్తాడనే భయంతో : బతికుండగానే తల్లిని శ్మశానానికి తీసుకెళ్లిన కొడుకు