Reunited By Facebook : 58 ఏళ్ల తర్వాత..తండ్రీ కూతుళ్లను కలిపిన ఫేస్ బుక్

ఫేస్‌బుక్‌ వల్ల ఓ మహిళ ఏకంగా 58 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలుసుకుంది. ఇంగ్లండ్‌ లోని లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లుండ్‌(59) అనే మహిళ ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు

Reunited By Facebook : 58 ఏళ్ల తర్వాత..తండ్రీ కూతుళ్లను కలిపిన ఫేస్ బుక్

Facebook

Reunited By Facebook ఫేస్‌బుక్‌ వల్ల ఓ మహిళ ఏకంగా 58 సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలుసుకుంది. ఇంగ్లండ్‌ లోని లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లుండ్‌(59) అనే మహిళ ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు తండ్రి బ్రియాన్ రాథరీ నుంచి దూరమయ్యింది. అప్పట్లో ఇంత సాంకేతిక లేకపోవడం వల్ల తండ్రిని వెతకడం కష్టం అయ్యింది. కానీ చనిపోయేలోపు తండ్రిని చూడాలని బలంగా నిర్ణయించుకుంది జూలీ.

ఆమె ప్రయత్నాలకు మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికి వెనకడుగు వేయలేదు. తెలిసిన అన్ని మార్గాల ద్వారా తండ్రి ఆచూకీ కోసం ప్రయత్నించేది. ఈ క్రమంలో ఓ రోజు జూలీ ఓ రోజు తండ్రి ఫోటోను ఫేస్‌బుక్‌ లో షేర్‌ చేసింది. దయచేసి తన తండ్రిని గుర్తించడంలో సాయం చేయాల్సిందిగా నెటిజన్లను కోరింది. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత ఆమె తండ్రి ఆచూకీ తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ ప్రత్యక్షమయ్యింది.

వెంటనే అందులో ఉన్న అడ్రస్‌కు వెళ్లిన జూలీ తన తండ్రిని కలుసుకుంది. తండ్రిని చూడగానే జూలీ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా జూలీ మాట్లాడుతూ.. సాధారణంగా నేను అద్భుతాలను నమ్మను. కానీ ఫేస్‌బుక్‌ నాకు చేసిన మేలు చూస్తే నమ్మక తప్పడం లేదు అని పేర్కొంది. కాగా, సోషల్‌ మీడియా ముఖ్యంగా ఫేస్‌బుక్‌ ద్వారా గతంలో ఇలానే అనేకసందర్భంగాల్లో ఎందరో విడిపోయిన వ్యక్తులను కలుసుకున్న విషయం తెలిసిందే.

ALSO READ Amith Shah : ఫ్రాంక్లీ స్పీకింగ్.. శ్రీనగర్ పర్యటనలో బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్ ని తొలగించిన అమిత్ షా