అర్ధరాత్రి ప్రసవం ఏంటీ పొమ్మన్న డాక్టర్లు..నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 10:54 AM IST
అర్ధరాత్రి ప్రసవం ఏంటీ పొమ్మన్న డాక్టర్లు..నడిరోడ్డుపైనే ప్రసవించిన గర్భిణి

రోగుల కోసం డాక్టర్లు ఎదురు చూడాలి కానీ డాక్టర్ల కోసం రోగులు ఎదురు చూడకూడదు అటువంటి పరిస్థితి రాకూడదు అని ఓ గొప్ప డాక్టర్ అన్నారు. కానీ కొంతమంది డాక్టర్లు రోగులపైనా..ఆఖరికి పురిటి నొప్పులతో హాస్పిటల్కు వచ్చే గర్భిణులతో వ్యవహరించే విధానం చూస్తే..వీరు నిజంగా డాక్టర్లేనా..డాక్టర్ చదువులో వీళ్లు ఏం నేర్చుకున్నారు? అనిపిస్తుంది. అటువంటి ఓ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహరైచ్ పట్టణంలో వెలుగుచూసింది. 

బహరైచ్ పట్టణంలోని బషీర్‌గంజ్ ప్రాంతానికి చెందిన షఫీఖ్ ఉన్నీసా అనే నిండు గర్భిణీని ఆమె కుటుంబసభ్యులు గురువారం (ఫిబ్రవరి 26,2020) అర్దరాత్రి పురిటి నొప్పులతో ప్రసవం కోసం బహరైచ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అర్థరాత్రి ప్రసవం ఏంటీ మాకు నిద్ర ఉండొద్దా…ఏంటీ న్యూసెన్స్ పోండి ప్రసవం లేదు ఏమీ లేదు పొమ్మని డాక్టర్లు అరిచారు. దీంతో గర్భిణితో పాటు ఆమె బంధువులు కూడా ఆశ్చర్యపోయారు. బాబ్బాబూ..నొప్పులతో బిడ్డ తట్టుకోలేకపోతోంది కొంచెం చూడండి సార్..అని వేడుకున్నా ఆ డాక్టర్లకు కనికరం కలగలేదు. చూసేది లేదు..హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకునేది లేదు ఎక్కడికి పోతారో పోండి..అంటూ కర్కశంగా గర్భిణిని హాస్పిటల్ నుంచి గెంటేశారు.

చేసేదేమీ లేక వెనుదిరిగారు.కానీ పురిటి నొప్పులు ఎక్కువ కావటంతో  షఫీఖ్ ఉన్నీసా ఎక్కువదూరం నడవలేక నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయింది. దీంతో.. షఫీఖ్ ఉన్నీసాను హాస్పిటల్ బయట నడిరోడ్డుపైనే పడుకోబెట్టారు కుటుంబ సభ్యులు. నొప్పులు అంతకంతకూ ఎక్కువయ్యాయి. బాధ తట్టుకోలేక ఆమె గిలగిల్లాడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అడ్డంగా దుప్పటి చుట్టారు. నొప్పులు పెరిగి షపీఖ్ ఉన్నీసా గర్భిణీ ప్రసవించింది. పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

ఈ ఘటన ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డీకే సింగ్ దృష్టికి వెళ్లటంతో ఆ రాత్రి డ్యూటీలో ఉన్న డాక్టర్లు..సిబ్బంది విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై దర్యాప్తుకు ఆదేశించారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.