Hyundai Verna : కారులో నుంచి నదిలోకి చెత్త విసిరిన మహిళ.. హ్యూందాయ్ వెర్నా కారు సీజ్

నదుల్లోకి చెత్తా, చెదారం వేయడం నేరం. చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ ఉంది. అయినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలామంది అదే పని చేస్తున్నారు. చెత్త, చెదారాన్ని, వ్యర్థాలను నదుల్లోకి విసురుతున్నారు. కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తున్న వేళ.. పౌరులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వాలు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నాయి. చుట్టుపక్కల వారిని సురక్షితంగా ఉంచాలని అంటున్నాయి. అయినా కొందరు మారడం లేదు.

Hyundai Verna : కారులో నుంచి నదిలోకి చెత్త విసిరిన మహిళ.. హ్యూందాయ్ వెర్నా కారు సీజ్

Hyundai Verna

Hyundai Verna : నదుల్లోకి చెత్తా, చెదారం వేయడం నేరం. చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ ఉంది. అయినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలామంది అదే పని చేస్తున్నారు. చెత్త, చెదారాన్ని, వ్యర్థాలను నదుల్లోకి విసురుతున్నారు. కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తున్న వేళ.. పౌరులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వాలు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నాయి. చుట్టుపక్కల వారిని సురక్షితంగా ఉంచాలని అంటున్నాయి. అయినా కొందరు మారడం లేదు.

car

కర్నాటకలో ఓ మహిళ చెత్త పని చేసి అడ్డంగా బుక్ అయ్యింది. ఇంట్లో పూజా కార్యక్రమాల తర్వాత మిగిలిన వ్యర్థాలను పెద్ద ప్లాస్టిక్ సంచిలో ఉంచి తన హ్యూందాయ్ వెర్నా కారులో తీసుకొచ్చిన మహిళ.. ఆ వ్యర్థాలను నదిలోకి విసిరింది. దీన్ని పర్యావరణవేత్త ఒకరు రికార్డు చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. అంతే, అధికారులు సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘించిన సదురు మహిళపై చర్యలు తీసుకున్నారు. ఆమెపై 269, 270 IPC, విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 51(b) కింద కేసులు నమోదు చేశారు. అంతేకాదు హ్యూందాయ్ వెర్నా కారుని సీజ్ కూడా చేశారు.

నేత్రావతి నదిని స్థానికులు పవిత్రంగా చూస్తారు. పూజలు చేస్తారు. అయితే చాలామంది మతపరమైన కార్యక్రమాలు, పూజలు పునస్కారాలు చేశాక వ్యర్థాలను తీసుకొచ్చి ఈ నదిలో వేస్తుంటారు. హ్యూందాయ్ వెర్నా కారులో వచ్చిన మహిళ ఓ పెద్ద పాలిబ్యాగ్ ను నదిలోకి విసిరింది. సరిగ్గా నదిలోకి పడేలా ఆ వ్యర్థాలను విసిరింది. ఆ తర్వాత తను వచ్చిన కారులోనే తిరిగి వెళ్లిపోయింది.

verna

దీన్ని షూట్ చేసిన పర్యావరణ వేత్త… ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశాడు. అంతే, ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. మహిళ చేసిన పనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై అధికారులు స్పందించాలని, నదిని కలుషితం చేసిన సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఆ వీడియోలో కారు నెంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. దాని అధారంగా అధికారులు సదురు మహిళను గుర్తించడం పెద్ద కష్టం కాలేదు. రంగంలోకి దిగిన మంగళూరు పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించారు. ఆమెపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రాణాంతకమైన రోగాలను వ్యాపింపజేసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేసు పెట్టారు. అలాగే విపత్తు నిర్వహణ చట్టం కింద కూడా కేసు బుక్ చేశారు.

”నేత్రావతి నదిని అందరూ పవిత్రంగా చూస్తారు. పూజలు చేస్తారు. దక్షిణ కన్నడ జిల్లాకు జీవనాడి లాంటిది. అలాంటి నదిలో చెత్తా చెదారం, వ్యర్థాలు వేయడం శిక్షార్హం” అని పోలీస్ కమిషనర్ శశి కుమార్ చెప్పారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు మహిళలను బాధ్యులను చేశారు. వారి పేర్లు శైలకా నాయక్, రచనా నాయక్, సుశీల. వారు వచ్చిన కారుని కూడా పోలీసులు సీజ్ చేశారు.

విగ్రహాల నిమజ్జనం, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వాటి వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం.. వీటి వల్ల నదులు కలుషితం అవుతున్నాయి. నదుల్లోని నీరు తాగేందుకు పనికి రాకుండా పోతోంది. ఈ క్రమంలోనే ఎలాంటి వ్యర్థాలను అయినా నదుల్లోకి వేయడం నేరం అని అనేక రాష్ట్రాలు చట్టం తీసుకొచ్చాయి. అంతేకాదు, చాలా నదులపై ఉన్న బ్రిడ్జిలకు పెద్ద పెద్ద ఫెన్సింగ్ లు వేసి ఉంచారు. ప్రజలు వ్యర్థాలను నదుల్లోకి వేయకుండా చూసేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. అయినప్పటికి అవేవీ పెద్దగా ప్రయోజనాలు ఇవ్వడం లేదు. ఇంకా చాలామంది వ్యర్థాలను నదుల్లోకి వేస్తూనే ఉన్నారు.