Viral Video: యువతిని కిడ్నాప్ చేసి, అడవిలో పెళ్లి చేసుకున్నాడు.. నెట్టింట వీడియో వైరల్

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రాలోని జైసల్మేర్‌లో ఒక యువతిని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి.. అడవిలో నిప్పుపెట్టి, దాని చుట్టూ యువతిని ఎత్తుకుని 7 చుట్లు తిరిగాడు. దీన్ని అతడు పెళ్లిగా భావించాడు. ఈ ఘటన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
Gauhati High Court: కుక్క మాంసం అమ్మకాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన హైకోర్టు
ఇక ఈ ఘటనపై నెటిజెన్లు సహా ఇతరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేయాలంటూ బాలిక కుటుంబీకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన మోహన్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుంది. నివేదికల ప్రకారం.. జూన్ 1న అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. అయితే దీనిపై కోపంగా ఉన్న అతడు.. ఆమెను కిడ్నాప్ చేసాడు. బాలికతో కలిసి అడవికి చేరుకుని నిప్పుపెట్టి బలవంతంగా ఏడు ప్రదక్షిణలు చేశాడు. దీన్ని అతడు పెళ్లిగా భావించాడు.
బీజేపీ విధ్వేష బజార్లో రాహుల్ గాంధీ తెరిచిన ప్రేమ దుకాణం ఇదే.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో ఒక యువతిని కిడ్నాప్ చేసి ఇలా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడొకడు.
నేరాల్లో రాజస్థాన్ నెం.1.. కానీ అన్నాచెల్లెల్లకు ఇవి కనబడవు.pic.twitter.com/zpHfpsTuiC— Tony (@tonybekkal) June 6, 2023
రాజస్థాన్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ జంగిల్ రాజ్ నడుస్తోందని విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని గూండాలు అధికారాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని, వారు ఒక అమ్మాయిని ఆమె ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లి అభ్యంతరకరమైన రీతిలో వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గెహ్లాట్ ప్రభుత్వ దుష్పరిపాలనకు రాజస్థాన్ అక్కచెల్లెళ్లు, కూతుళ్లు ఎంతకాలం సిగ్గుపడాలని విమర్శలు గుప్పించారు.
ప్రధాన నిందితుడు అరెస్ట్.. మరికొందరి కోసం గాలిస్తున్నారు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. ఘటనలో ప్రమేయం ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, బాలికను మళ్లీ కిడ్నాప్ చేస్తామని బెదిరిస్తున్నారని బాలిక కుటుంబం అదనపు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. యువతికి పెళ్లి కాకుండా చేయడానికి ఉద్దేశ్యపూర్వకంగా నిందితులు ఇలాంటి పనులు చేస్తున్నారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.