జుట్టుకు తెల్ల రంగేసుకుని అయ్యప్ప ఆలయంలోకి మహిళ ..

  • Edited By: veegamteam , January 10, 2019 / 10:58 AM IST
జుట్టుకు తెల్ల రంగేసుకుని అయ్యప్ప ఆలయంలోకి మహిళ ..

శబరిమల : అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదాస్పందంగా మారుతున్న క్రమంలో మరో మహిళ స్వామిని దర్శించుకున్నట్లుగా మరోసారి కలకలం రేగింది. మంజు అనే 36 ఏళ్ల మహిళ అయ్యప్పను దర్శించుకున్నట్లు జనవరి 9న  సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా జుట్టుకు తెల్లరంగు వేసుకుని ఆలయంలోకి వెళ్లినట్లు చెప్పడంతో పాటు ఫోటోలు కూడా పోస్ట్ చేయడంతో అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.  

ఈ అంశంపై మంజు మాట్లాడుతు..త్రిస్సూర్ నుంచి బస్సులో శబరిమల చేరుకుని జనవరి 8వ తేదీన అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన స్వామిని దర్శించుకున్నాని రెండు గంటల పాటు ఆలయంలోనే గడిపాననీ..నల్ల జుట్టుకు తెల్లరంగు వేసుకుని వెళ్లటంతో తనను ఎవరేూ గుర్తు పట్టలేదనీ..పెద్ద వయస్సు మహహిళగానే అందరూ భావించారని దీంతో దీంతో నన్నెవరూ అడ్డుకోలేదని తెలిపింది. అంతటితో ఊరుకోకుండా మళ్లీ జుట్టుకు రంగు వేసుకుని మరోసారి అయ్యప్పను దర్శించుకుంటాను’ అని మంజు  సోషల్‌మీడియాలో వీడియో పోస్ట్ చేయంతో ఆమెపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసు మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇద్దరు మహిళలు ప్రవేశం వివాదాస్పందగా మారుతున్న క్రమంలో జుట్టుకు రంగేసుకుని మంజు ఆలయం ఎంట్రీ మరోసారి వివాదంగా మారింది.