Brain Surgery : బ్రెయిన్ స‌ర్జ‌రీ చేస్తుండగా హ‌నుమాన్ చాలీసా ప‌ఠించిన‌ మ‌హిళ‌

బ్రెయిన్ సర్జరీ చేస్తున్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించారు ఓ మహిళ. ఈ ఘటన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV Telugu News

Brain Surgery : ఢిల్లీ ఎయిమ్స్‌లో అరుదైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. 24 ఏళ్ల మహిళ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు.. ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సర్జరీకి ఏర్పాట్లు చేశారు.. వైద్యులు స‌ర్జ‌రీ చేస్తుండగా మహిళ హ‌నుమాన్ చాలీసా పఠించారు.

జులై 23 తేదీన న్యూరోస‌ర్జ‌రీ విభాగంలో వైద్యులు మూడున్న‌ర గంట‌ల పాటు సర్జరీ చేసి బ్రెయిన్ ట్యూమ‌ర్‌ను తొలగించారు. అయితే సర్జరీ చేస్తున్న సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నారు. తనకిష్టమైన హ‌నుమాన్ చాలీసాను ఆల‌పించారు.

కాగా ఈ ఘ‌ట‌న‌ను సంబందించిన వివరాలను ఎయిమ్స్ డాక్ట‌ర్ దీప‌క్ గుప్తా వివ‌రించారు. మ‌హిళ‌కు అన‌స్తీషియాతో పాటు పెయిన్‌కిల్ల‌ర్ మందులు ఇచ్చామ‌ని చెప్పారు. అయినా ఆమె స్పృహలోనే ఉన్నారని వివరించారు. ఇక ఆప‌రేష‌న్ రూమ్‌లో మ‌హిళ వీడియోను ఓ జ‌ర్న‌లిస్ట్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

ఆమె హ‌నుమాన్ చాలీసా చ‌దువుతుండ‌గా దీప‌క్ గుప్తాతో పాటు న్యూరో అన‌స్తీషియా బృందం బ్రెయిన్ ట్యూమ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని ట్వీట్‌లో వెల్ల‌డించారు.

10TV Telugu News