Bengaluru: ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది దుస్తులు తీసేయమన్నారన్న మహిళ.. అధికారులు ఏం చెప్పారంటే

మహిళ ఆరోపణ ప్రకారం.. సెక్యూరిటీ చెక్ సందర్భంగా సిబ్బంది తన పై దుస్తులు తీసేయమన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఆ మహిళ పేర్కొంది. ట్విట్టర్ ద్వారా బెంగళూరు ఎయిర్‌పోర్ట్ అకౌంట్ ట్యాగ్ చేసింది. దీనికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు.

Bengaluru: కర్ణాటక, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తనను సెక్యూరిటీ సిబ్బంది దుస్తులు తీసేయమన్నారని ఆరోపించింది ఒక మహిళ. ఈ విషయంపై ఆ మహిళ మంగళవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనికి ఎయిర్‌పోర్ట్‌ అధికారులు స్పందించారు.

Chennai: ట్రక్కు కింద పడి మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి.. స్కూటీపై నుంచి గుంతలో పడటంతో దారుణం

మహిళ ఆరోపణ ప్రకారం.. సెక్యూరిటీ చెక్ సందర్భంగా సిబ్బంది తన పై దుస్తులు తీసేయమన్నారు. ఇది చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ఆ మహిళ పేర్కొంది. ట్విట్టర్ ద్వారా బెంగళూరు ఎయిర్‌పోర్ట్ అకౌంట్ ట్యాగ్ చేసింది. దీనికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించారు. పూర్తి వివరాలు తెలియజేస్తే విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం దీనిపై మళ్లీ ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. మహిళ ఆరోపించినట్లుగా అలాంటి ఘటనేదీ జరగలేదన్నారు. ‘‘సెక్యూరిటీ చెక్ చేసే సమయంలో ఆమె డెనిమ్ జాకెట్ ధరించి ఉంది. బ్యాడ్జిలు, పూసలు వంటివి కూడా ధరించి ఉంది. ఈ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కర్టెన్స్ వెనక్కు తీసుకెళ్లి, వాటిని తీసుకున్నారు.

Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. తల్లికి తోడుగా ఉన్న కూతురు ప్రియాంకా గాంధీ

ఈ సందర్బంగా ఆమె డెనిమ్ జాకెట్ కూడా తొలగించి ఉంది. వాటిని స్కాన్ చేసి, తెచ్చేలోపే ఆమె బయటకు వచ్చింది. ఇదంతా జరిగేటప్పుడు ఒక మహిళా సిబ్బంది ఆమె పక్కనే ఉంది. ఆమె డెనిమ్ జాకెట్ లేకుండానే బయటకు వచ్చేటప్పుడు తనకేం అభ్యంతరం లేదని చెప్పింది. ఆమె తనకుతానుగానే బయటకు వచ్చింది’’ అని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఆమె ఆరోపించినట్లుగా దుస్తుల్ని తొలగించమనలేదని, స్కానింగ్ కోసం డెనిమ్ జాకెట్, వంటివి మాత్రమే తీసేసిందని చెప్పారు. దీని ద్వారా ఎయిర్‌పోర్ట్ అధికారులు తప్పుచేయలేదని స్పష్టం చేశారు. కాగా, మహిళ ఆరోపణల నేపథ్యంలో చాలా మంది ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తీరును తప్పుబట్టారు.

అయితే, ఎయిర్‌పోర్ట్ అధికారుల సమాధానంతో ఈ వివాదం సద్దుమణిగింది. మరోవైపు ఎయిర్‌పోర్ట్ అధికారుల సమాధానం నేపథ్యంలో బుధవారం ఉదయం ఆ మహిళ తన ట్వీట్ డిలీట్ చేసింది. అనంతరం అకౌంట్‌ను కూడా పూర్తిగా తొలగించింది.

 

ట్రెండింగ్ వార్తలు