Remdesivir Injection: రెమ్‌డెసివిర్ కోసం కాళ్లు మొక్కింది.. చివ‌ర‌కు కొడుకును కోల్పోయింది..

మ్‌డెసివిర్ ఇంజక్షన్ కోసం కరోనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఈ ఇంజక్షన్లు అందుబాటులో లేవు.. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తన కొడుకును బ్రతికిచుకునేందుకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కోసం రింకీదేవీ అనే మహిళ చీఫ్ మెడికల్ ఆఫీస‌ర్(సీఎంవో) కాళ్లు మొక్కింది.

Remdesivir Injection: రెమ్‌డెసివిర్ కోసం కాళ్లు మొక్కింది.. చివ‌ర‌కు కొడుకును కోల్పోయింది..

Remidesiver Injection

Remdesivir Injection: రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కోసం కరోనా సోకినా వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. కొన్ని చోట్ల ఈ ఇంజక్షన్లు అందుబాటులో లేవు.. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తన కొడుకును బ్రతికిచుకునేందుకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కోసం రింకీదేవీ అనే మహిళ చీఫ్ మెడికల్ ఆఫీస‌ర్(సీఎంవో) దీప‌క్ ఓహ్రీ కాళ్లు మొక్కింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. రింకీదేవీ కుమారుడు కొద్దీ రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు అధికంగా ఉండటంతో అతడిని సెక్టార్ 51లోని ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ ఇవ్వాలని ఇంజక్షన్ తీసుకురావాలని బాధితుడి తల్లీ రింకీదేవికి తెలిపారు.

ఇంజక్షన్ కోసం సమీపంలోని అన్ని మెడికల్ షాపులకు వెళ్ళింది. ఎక్కడ దొరకలేదు. తెలిసిన వారు మెడిక‌ల్ ఆఫీస‌ర్ దీప‌క్ ఓహ్రీ కార్యాల‌యం వ‌ద్ద ఇంజక్షన్ అందుబాటులో ఉండాలని తెలిపారు. దీంతో ఆమె ఆగమేఘాలమీద అక్కడికి వెళ్లారు. తమ కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని, తనకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ కావాలని వైద్యాధికారి దీప‌క్ ఓహ్రీ ముందు ప్రాధేయపడింది. అతడు లేవని సమాధానం ఇవ్వడంతో అతడి కాళ్లపై పడిమరీ బ్రతిమాలింది.

ఇంజక్షన్ అందుబాటులో లేదని తెలిపారు అధికారులు. చేసేదేమి లేక బుధవారం సాయంత్రం 4:30 నిమిషాలకు కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు విడిచారని డాక్టర్లు తెలిపారు. దీంతో రింకీదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరికి కొడుకు మృతదేహం తీసుకోని స్మశానవాటికకు వెళ్లారు.