Tinder app : కారు లిఫ్ట్ కోసం డేటింగ్ నాటకమాడిన యువతి

ఒక యువతి నివసిస్తున్న ఏరియాలో ఊబెర్ వెహికల్స్ స్ట్రైక్ నడుస్తోంది. సాయంత్రం ఆ యువతి తన ప్రియుడ్నికలవాటానికి వెళ్ళాలి. ఆమెకు వెహికల్ లేదు. ఏమి చేయాలో అర్ధం కాలేదు. చేతిలో స్మార్ట్ ఫ

Tinder app : కారు లిఫ్ట్ కోసం డేటింగ్ నాటకమాడిన యువతి

Tinder App

Tinder app : ఒక యువతి నివసిస్తున్న ఏరియాలో ఊబెర్ వెహికల్స్ స్ట్రైక్ నడుస్తోంది. సాయంత్రం ఆ యువతి తన ప్రియుడ్నికలవాటానికి వెళ్ళాలి. ఆమెకు వెహికల్ లేదు. ఏమి చేయాలో అర్ధం కాలేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ చూస్తూ ఉంటే అందులోని టిండర్ యాప్ చూసి ఆమెకు ఒక ఐడియా వచ్చింది

టిండర్ యాప్ లో తనకు కావాల్సిన వాళ్లతో పరిచయం పెంచుకుని వాళ్లకు ఇష్టముంటే డేటింగ్ కు వెళ్ళవచ్చు.  ఇంకేముంది టిండర్ యాప్ లో ఒక వ్యక్తిని లైన్ లో పెట్టింది. అతనితో చాటింగ్ మొదలు పెట్టి బయటకు వెళ్దాం రా అని పిలిచింది. అమ్మాయి పిలిచింది కదా… కారు వేసుకుని వాయు వేగంతో వచ్చాడు ఆ యువకుడు.

ఆయువతి కారెక్కి అతడితో రైడ్ కు వెళ్లిపోయింది. కొంతదూరం వెళ్లాక ఒకచోట కారు ఆపమని కోరింది. అతడు కారు ఆపాడు. తెలిసిన వ్యక్తికి ఒక వస్తువు ఇచ్చివస్తానని చెప్పి అక్కడే ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళింది. యువకుడు  కారులోనే కూర్చుని ఆమెకోసం వెయిట్ చేయసాగాడు.  చాలా సమయం గడిచింది.  ఎంత సేపటికి రాకపోయేసరికి విసుగు చెంది  ఆ ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు.

Also Read : Protect Credit Cards : మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు జాగ్రత్త.. 6 సెకన్లలో హ్యాక్ చేసేస్తారు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి

ఓ వ్యక్తి బయటకు వచ్చి ఆమె తన  ఫ్రెండ్‌తో  ఉంది…. ఇప్పుడు రాలేదు   అని సమాధానం చెప్పి తలుపు వేసుకున్నాడు. అప్పటికి కానీ ఆయువకుడికి తెలియలేదు, తాను మోసపోయానని.   మర్నాడు ఆయువతి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఊబెర్ స్ట్రైక్ వల్లే నీతో డేటింగ్   నాటకమాడానని చెప్పింది.   ఈవిషాద డేటింగ్ కధను బాధిత యువకుడు సోషల్ మీడియా రెడిట్ లో పోస్ట్ చేశాడు.  ఇప్పుడీ కధ చదివిని వారంతా అయ్యో పాపం అంటూ యువకుడిపై జాలిపడుతున్నారు.