ఇదేం దారుణం : వీధికుక్కలకు అన్నం పెట్టిందని ఫైనేశారు

మూగ జీవులకు ఆహారం పెట్టి వాటి కడుపు నింపితే మొచ్చుకుంటాం..జంతువులపై ఎంత ప్రేమ అని ప్రశంసిస్తాం.

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 11:19 AM IST
ఇదేం దారుణం : వీధికుక్కలకు అన్నం పెట్టిందని ఫైనేశారు

మూగ జీవులకు ఆహారం పెట్టి వాటి కడుపు నింపితే మొచ్చుకుంటాం..జంతువులపై ఎంత ప్రేమ అని ప్రశంసిస్తాం.

ముంబై : మూగ జీవులకు ఆహారం పెట్టి వాటి కడుపు నింపితే మొచ్చుకుంటాం..జంతువులపై ఎంత ప్రేమ అని ప్రశంసిస్తాం. కానీ మహారాష్ట్రంలో మాత్రం మూగజీవాలను అన్నం పెట్టిందని ఓమహిళకు లక్షల రూపాయలు జరిమానా విధించిన వింత ఘటన జరిగింది. వీధి కుక్కలకు అన్నం పెట్టిన ఓ మహిళకు అపార్టుమెంట్ సొసైటీ రూ.3.6 లక్షల జరిమానా విధించిన వింత ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. 
Read Also : టుడే రిలీజ్ : NEET UG-2019 అడ్మిట్ కార్డు డౌన్ లోడ్

ముంబై నగరంలోని నిసర్గ్ హెవెన్ సొసైటీలో నివాసముంటున్న నేహా దత్వానీ అనే మహిళ ఓ అడ్వర్ టైజ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది. స్వతహాగానే  జంతు ప్రేమికురాలైన నేహా వీధి కుక్కలకు ప్రతీరోజూ అన్నం పెడుతోంది. వాటి పొట్ట నింపుతోంది.

కుక్కలను చేరదీసిన నేహా వాటికి రోజూ అన్నం పెడుతున్నందు వల్లనే అవి ఆ ప్రాంతంలోని కొందరిపై మొరుగుతున్నాయనీ.. దాడి చేస్తున్నాయనీ.. ఆ కుక్కలతో అపార్ట్ మెంట్ లోని సెల్లార్ అంతా అపరిశుభ్రంగా తయారవుతోందని అపార్ట్ మెంట్ నివాసులు ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు..వీధికుక్కలకు అన్నం పెడుతున్న నేహాకు రూ.3.6 లక్షల జరిమానాను విధించామని నిసర్గ్ హెవెన్ సొసైటీ ఛైర్మన్ మితేష్ బోరా తెలిపారు. 
 
ఆ సొసైటీలో నివాసముంటున్న 98 శాతం మంది నివాసుల తీర్మానం మేరకే ఈ పనిచేశామని మితేష్ బోరా చెప్పారు. కాగా తనకు జరిమానా విధించి జంతువుల హక్కులను సొసైటీ కాలరాచిందని నేహా అంటోంది. మరోపక్క మనుషులకు కూడా హక్కులుంటాయని వాటి సంగతేమిటని సొసైటీ వాసులు ప్రశ్నిస్తున్నారు.
Read Also : చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు : నెల్లూరు జిల్లాలో కలకలం