“పాకిస్తాన్ జిందాబాద్” వ్యాఖ్యలు చేసిన యువతికి నక్సల్స్ తో సంబంధాలు

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2020 / 09:39 AM IST
“పాకిస్తాన్ జిందాబాద్” వ్యాఖ్యలు చేసిన యువతికి నక్సల్స్ తో సంబంధాలు

కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు చేసింది.  ఒవైసీ వస్తుండగానే వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’అని నినాదాలు చేయడం ప్రారంభించింది. ఆందోళనకారులను కూడా తనతో పాటు నినదించమని కోరింది.  

దీంతో వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతి అలాగే పలుమార్లు నినాదం చేస్తుండటంతో అసదుద్దీన్ ఓవైసీ వెనక్కి వచ్చి మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా అలాగే నినాదాలు చేస్తూ పోయింది. నిర్వహకులు ఆపడానికి ప్రయత్నిస్తుంటే చివరకీ ‘హిందూస్థాన్ జిందాబాద్’ అని మాట మార్చింది.  అయినప్పటికీ ఆమె నుంచి మైక్ లాక్కోవడంతో పాటు వెనక్కి తీసుకెళ్లిపోయారు పోలీసులు. అనంతరం ఆమెను రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి 14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

అయితే పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన అమూల్య లియోనాకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక సీఎం యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన అమూల్య తప్పనిసరిగా శిక్షించబడాల్సిందేనన్నారు యడియూరప్ప. అమూల్య తండ్రే..తన కూతరు కాళ్లు,చేతులు విరగగొట్టమని చెప్పారని,తన కూతరుకి బెయిల్ కూడా పొందకూడదని,తాను ఏమాత్రం తన కూతరుకి అండగా నిలబడనని ఆయన చెప్పినట్లు యడియూరప్ప తెలిపారు.

మరీ ముఖ్యంగా అమూల్య వంటి  వ్యక్తుల వెనుక ఉన్నగ్రూప్ లు, అముల్య మాదిరిగా పెరుగుతున్న వ్యక్తులు …. వారిపై చర్యలు తీసుకోవాలి మరియు వారిని సరిగా విచారించాలి. ఆమెకు ఎవరు మద్దతు ఇస్తున్నారో అప్పుడు తెలుస్తుంది. ఆమెకు నక్సల్స్‌తో సంబంధాలున్నాయనడానికి రుజువు ఉంది. ఆమెను శిక్షించాలి మరియు ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలి అని యడియూరప్ప తెలిపారు.

అమూల్య తండ్రి మాట్లాడుతూ…తన కూతరు పెద్ద తప్పు చేసింది. కొంతమంది ముస్లింలతో చేరి నా మాట వినడం లేదు అని ఆయన తెలిపారు.

Read More>>అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్