Himanta Biswa Sarma: మహిళలు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదు.. అజ్మల్‌కు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం

మహిళలు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌కు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆడవాళ్లు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదన్నారు.

Himanta Biswa Sarma: మహిళలు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదు.. అజ్మల్‌కు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం

Himanta Biswa Sarma: మహిళలేమీ పిల్లల్ని కనిపెట్టే పరిశ్రమలు కాదని వ్యాఖ్యానించారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. మహిళలు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌కు హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళల గర్భం వ్యవసాయ క్షేత్రం కాదన్నారు.

Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ‘ఆప్’దే హవా.. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి చెక్

నాలుగు రోజుల క్రితం బద్రుద్దీన్ అజ్మల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘హిందువులు వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు? ముస్లింలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కంటారు. సారవంతమైన నేలలో విత్తనాలు నాటితేనే మంచి పంట వస్తుంది’’ అని అజ్మల్ అన్నాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. హిందువులుసహా వివిధ రాజకీయ పక్షాలు అజ్మల్ వ్యాఖ్యల్ని ఖండించాయి. పలు చోట్ల అజ్మల్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అసోం సీఎం కూడా స్పందించారు. అజ్మల్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.

CM KCR-Revanth Reddy : కేసీఆర్‌కు ఆ పాపం ఊరికేపోదు .. దానికి ఫలితమే కూతురుకి ఏసీబీ నోటీసులు : రేవంత్ రెడ్డి

‘‘ఆడవాళ్లు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదు. సారవంతమైన నేలలోనే విత్తనాలు నాటాలని అజ్మల అన్నాడు. మన తల్లుల గర్భం ఏమైనా వ్యవసాయ క్షేత్రమా? ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే అజ్మల్ మాటల్ని పట్టించుకోవద్దు. ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనండి. అప్పుడే వాళ్లను బాగా పెంచి డాక్టర్లు, ఇంజనీర్లు చేయగలుగుతారు. మనం పిల్లల సంక్షేమం గురించి ఆలోచించాలి. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లు మంచి విద్య, మంచి ఆహారం అందించలేకపోతున్నారు. ముస్లిం మహిళలకు చెప్పేదొకటే.. పిల్లల్ని బాగా చదివించి డాక్టర్లు, ఇంజనీర్లు చేయగలిగితేనే ఎక్కువ మంది పిల్లల్ని కనండి. అంతేకానీ, వాళ్లను ఇమామ్‌లు, జునాబ్‌లు చేయొద్దు’’ అని హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు.

మరోవైపు హిందూ సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అజ్మల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాడు. ఏ మతం వారి మనోభావాలు దెబ్బతీయాలనే ఆలోచన తనకు లేదన్నాడు. తన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నట్లు చెప్పాడు.