Covid Vaccine : ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు, నిపుణుల స్పష్టత

కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అయితే టీకా విషయంలో ఇంకా పలు అనుమానాలు, సందేహాలు, భయాలు నెలకొని ఉన్నాయి. ప్రసవం తర్వాత టీకా తీసుకోవచ్చా? శిశువుకి ఏమైనా ఇబ్బందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

Covid Vaccine : ప్రసవం తర్వాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు, నిపుణుల స్పష్టత

Covid Vaccine

Covid Vaccine : కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అయితే టీకా విషయంలో ఇంకా పలు అనుమానాలు, సందేహాలు, భయాలు నెలకొని ఉన్నాయి. ప్రసవం తర్వాత టీకా తీసుకోవచ్చా? శిశువుకి ఏమైనా ఇబ్బందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

ప్రసవం తర్వాత ఎప్పుడైనా మహిళలు కొవిడ్‌-19 టీకాలు పొందొచ్చని ఆరోగ్య పరిరక్షణ నిపుణులు సూచించారు. కాన్పు అయిన వెంటనే టీకాను పొందొచ్చని ఢిల్లీలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఖాన్‌ అమిర్‌ మరూఫ్‌ చెప్పారు. దీనివల్ల నవజాత శిశువుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు.

కరోనా నుంచి రక్షణ పొందడానికి గర్భిణులకూ వ్యాక్సిన్లను అనుమతించాలని కోరారు. ఇక పాలిచ్చే తల్లులు కూడా కరోనా టీకాలు పొందేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. వ్యాక్సిన్‌ పొందాక కనీసం గంటపాటు కూడా బిడ్డకు స్తన్యమివ్వడాన్ని ఆపాల్సిన పనిలేదంది. ప్రసవం తర్వాత తల్లికి కొవిడ్‌ టీకాలిచ్చే విషయంలో జాప్యానికి కారణాలూ కనిపించడం లేదని అన్నారు. వ్యాక్సిన్‌ అనంతరం.. పాలిచ్చే తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

రుతుచక్రంలో ఏ దశలోనైనా మహిళలు వ్యాక్సిన్‌ పొందొచ్చని స్త్రీ వైద్య నిపుణులు తెలిపారు. కొవిడ్‌ వల్ల గర్భిణులకు కచ్చితంగా సిజేరియన్‌ కాన్పులు అవుతాయని చెప్పలేమన్నారు. ‘‘ఇతరులతో పోలిస్తే గర్భిణులకు కరోనా సోకే ముప్పు ఎక్కువేమీ కాదు. అయితే ఈ వైరస్‌ బారినపడితే వీరిలో వ్యాధి తీవ్రం కావొచ్చు’’ అని వివరించారు. ఈ నేపథ్యంలో గర్భిణులకూ టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వం ఇందుకు అనుమతినివ్వలేదు.

కొవిడ్‌ టీకాలను గర్భిణులపై ప్రయోగాత్మకంగా పరీక్షించలేదని, అందువల్ల అవి వారికి ఎంతమేర సురక్షితం, ఎంతమేర సామర్థ్యాన్ని చాటుతాయన్న దానిపై డేటా లభించకపోవడమే ఇందుకు కారణమని మరూఫ్‌ చెప్పారు. మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో గర్భిణులకు వైరస్‌ నుంచి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా వారికి టీకాలు ఇవ్వాలని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలాజిక్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రభుత్వానికి సిఫార్సు చేశాయన్నారు.

వీరు వ్యాక్సిన్లు పొందొచ్చని డబ్ల్యూహెచ్‌వో చెప్పినప్పటికీ భారత్‌లో ఈ అంశంపై చర్చ నడుస్తోందని ‘కోయలేషన్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌’ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ రంజన్‌ తెలిపారు. భారత్‌లో ఇస్తున్న కొవిడ్‌ టీకాల్లో సజీవ వైరస్‌ లేదని, అందువల్ల గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వీటివల్ల తీవ్ర దుష్ప్రభావాలేమీ ఉండబోవని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలాజిక్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా’ మాజీ అధ్యక్షుడు జైదీప్‌ మల్హోత్రా తెలిపారు.