Antibodies: కొవిడ్-19పై పోరాటంలో మహిళల్లోనే ఎక్కువ యాంటీబాడీలు

కొవిడ్-19 లాంటి మహమ్మారితో పోరాడాలంటే యాంటీబాడీలు తప్పనిసరి. ఎన్ని ఎక్కువగా ఉంటే అంత సులువుగా ...

Antibodies: కొవిడ్-19పై పోరాటంలో మహిళల్లోనే ఎక్కువ యాంటీబాడీలు

Women Have More Antibodies To Fight Covid 19

Antibodies: కొవిడ్-19 లాంటి మహమ్మారితో పోరాడాలంటే యాంటీబాడీలు తప్పనిసరి. ఎన్ని ఎక్కువగా ఉంటే అంత సులువుగా బయటపడగలం. కరోనావైరస్ తో పోరాడే క్రమంలో పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ యాంటీబాడీలు ఉంటున్నాయట. ముంబైకు చెందిన సెరో సర్వే ఈ కీలక విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం మురికివాడల్లో ఉండే వారి కంటే ఇతర ప్రాంతాల్లో ఉండేవారిలోనే కొవిడ్ పాజిటివ్ ఎక్కువగా నమోదవుతుందట. పాత కొవిడ్ 19 ధాటిని ఎదుర్కొన్న వారే వారంతా. బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ చేసిన సర్వేలో శనివారం ఈ విషయాలు వెలువడ్డాయి. పురుషుల్లో 35.02శాతం యాంటీబాడీలు ఉండగా మహిళల్లో 37.12శాతం ఉన్నాయి.

‘సెరో సర్వేలో 41.61శాతం సెంట్ సెరో పాజిటివిటీ వారి బ్లడ్ శాంపుల్స్ లో కనిపించింది. అదికూడా మురికివాడల్లో ఉండే మునిసిపల్ డిస్పెన్సరీల్లో ఉండేవారిలోనే. మొత్తంగా ముంబైలోని 24వార్డుల్లో బ్లడ్ శాంపుల్స్ పై జరిపిన పరీక్షల్లో 10వేల 197మందిని పరీక్షించారు. వారిలో 36.30శాతం సెరో పాజిటివిటీగా తేలింది.

ఈ శాంపుల్స్ అన్నింటినీ బీఎంసీకి చెందిన మాలిక్యులర్ బయోలజీ ల్యాబొరేటరీలో పరీక్షించారు. గతేడాది జులైలో తొలి సర్వే నిర్వహించి దాదాపు మూడు వార్డుల్లో 57శాతం సెరో పాజిటివిటీ ఉన్నట్లుగా గుర్తించారు. ఆగష్టు నెలలో మాత్రం 45శాతం సెరో పాజిటివిటీ ఉన్నట్లు తెలిసిందని అధికారులు అంటున్నారు.

మురికివాడలను మినహాయించి తీసుకున్న రక్త నమూనాలను ప్రైవేట్ ల్యాబొరేటరీల్లో పరీక్షించగా అందులో 28.5శాతం ఉన్నట్లు ప్రస్తుత సర్వేలో తెలిసింది.