ఏడాదిలో ఆ 5రోజులు స్త్రీలు బట్టలు వేసుకోరు..మంచుకొండల గ్రామంలో వింత ఆచారం

  • Published By: nagamani ,Published On : May 29, 2020 / 06:26 AM IST
ఏడాదిలో ఆ 5రోజులు స్త్రీలు బట్టలు వేసుకోరు..మంచుకొండల గ్రామంలో వింత ఆచారం

వెండిలాంటి మంచుముద్దలు..కనువిందు చేసే ప్రకృతి అందాలు..భూతల స్వర్గంగా విలసిల్లే  ది ల్యాండ్‌ ఆఫ్‌ స్నోస్‌ ‘హిమాచల్‌ప్రదేశ్‌’ ఓ గ్రామంలో ఇప్పటికీ ఓ వింత విచిత్ర ఆచారం కొనసాగుతోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లోని వీణా అనే గ్రామంలోని ప్రజల జీవనశైలి చాలా వింతగా ఉంటుంది. సమాజం ఎంతో వేగంగా పరుగెడుతున్నీ ఈ రోజుల్లో కూడా వీణాగ్రామస్తులు వారి ఆచారాలను..సంప్రదాలను ఏమాత్రం విడిచిపెట్టటానికి ఇష్టపడరు. విచిత్రమైన ఆచారాలు పాటిస్తుంటారు.

ఏడాదిలో 5 రోజుల పాటు ఆ గ్రామంలోని భర్తలు వారి భార్యతో అస్సలు మాట్లాడరు. ఒకేఇంటిలో ఉంటారు కానీ..నువ్వెవరో..నేనెవరో అన్నట్లుగా ఉంటారు. ఆ  5 రోజుల పాటు ఎవ్వరూ మద్యం ముట్టుకోరు.
అంతేకాదు సంవత్సరంలో 5 రోజులపాటు మహిళలు అస్సలు బట్టలే వేసుకోరు. ఇంటిపనుల నుంచి  ప్రతీ పనిని దుస్తులు వేసుకోకుండానే చేస్తారు. అలా చేయకపోతే అరిష్టమనీ..కీడు జరుగుతుందని నమ్ముతారు. వారికే కాదు తమ గ్రామానికి కీడు జరుగుతుందని నమ్ముతారు.

వీణా గ్రామం పరిధిలోని పూర్వ చరిత్ర : ఒకానొక్కప్పుడు ఈ ప్రాంతంలోకి రాక్షసులు వచ్చి..ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసేవారట. చిత్రహింసలకు గురిచేసేవారట. ఆ సమయంలో లాహు ఘోండ్ దేవత వచ్చి ఆ రాక్షసులను మట్టుపెట్టి వారిని కాపాడారని కథలు కథలుగా చెప్పుకుంటారు.

లాహు ఘోండ్ దేవత రాక్షసులను చంపిన సందర్భంగా ఈ గ్రామంలో పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను ఐదు రోజులలో జరుపుకుంటారు మరియు ఆ కాలంలో ప్రజలు త్రాగడానికి అనుమతించబడరు. బట్టలు విప్పిన స్త్రీలు తమ నమ్రతను కప్పిపుచ్చడానికి ఉన్ని పట్టాలను ఉపయోగిస్తారు. మొత్తంమీద పిని గ్రామవాసులు ఈ సందర్భంగా చాలా నిర్బంధ జీవితాన్ని గడుపుతారు.

Read: ప్రసవానికి 4గంటల ముందే తను ప్రెగ్నెంట్ అని తెలిసిందట.. Big Surprise