Swalih Bathery : రా.9 తర్వాత రోడ్లపై కనిపించే స్త్రీలంతా వేశ్యలే, రేప్ చేసి చంపినా తప్పు కాదు.. ముస్లిం మతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

రాత్రి 9 తర్వాత రోడ్లపై కనిపించే స్త్రీలంతా వేశ్యలే. వారిని అత్యాచారం చేసి, హత్య చేసినా తప్పు కాదు..

Swalih Bathery : రా.9 తర్వాత రోడ్లపై కనిపించే స్త్రీలంతా వేశ్యలే, రేప్ చేసి చంపినా తప్పు కాదు.. ముస్లిం మతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

Swalih Bathery

Swalih Bathery : కేరళ ముస్లిం మతాధికారి స్వాలి బత్రే మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాత్రి 9 తర్వాత రోడ్లపై కనిపించే స్త్రీలంతా వేశ్యలే. వారిని అత్యాచారం చేసి, హత్య చేసినా తప్పు కాదు అని ఆయన అన్నారు. 2011లో గోవిందస్వామి అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా గాయపరిచాడు. 5 రోజుల తర్వాత ఆమె ఆమె మరణించింది. 2016లో ఈ కేసులో సుప్రీంకోర్టు అతడి ఉరిశిక్షను ఏడేళ్ల కఠిన కారాగార శిక్షగా మారింది.

తాజాగా ఈ కేసు గురించి బత్రే ఇలా మాట్లాడారు. ‘`రాత్రిపూట ప్రయాణించే మహిళలందరూ వేశ్యలే. అత్యాచారానికి గురైన బాలిక కూడా రాత్రి పూట ప్రయాణిస్తోంది కాబట్టే గోవింద స్వామికి చిక్కింది. అందులో అతని తప్పేముంది. రాత్రిపూట బయట కనిపించే మహిళలపై అత్యాచారానికి పాల్పడడం, చంపడం తప్పు కాదు” అని బత్రే అన్నారు.

కేరళలో ముస్లిం మతాధికారులలో 27 ఏళ్ల స్వాలి బత్రే ఒకరు. ఆయన హెచ్‌డీపీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. దీంతో 27 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలానే ఉంటారు. ఈయన ఇప్పటికే ఇలాంటి ఎన్నో వివాదాస్పద కామెంట్స్ చేశారు. వివాదాస్పద మతాధికారిగా గుర్తింపు పొందారు. మహిళలను ఉద్దేశించి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బత్రే వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి.