ట్రాఫిక్ కొత్త రూల్స్ : డియర్ విక్రమ్.. సిగ్నల్ బ్రేక్ చేశావ్.. ఫైన్ పడదులే!

ఇంతకీ విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయిందా? లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో ఇస్రో విక్రమ్ ల్యాండర్ ఒకటిగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తీపు కబురు అందించింది. 

  • Published By: sreehari ,Published On : September 10, 2019 / 09:06 AM IST
ట్రాఫిక్ కొత్త రూల్స్ : డియర్ విక్రమ్.. సిగ్నల్ బ్రేక్ చేశావ్.. ఫైన్ పడదులే!

ఇంతకీ విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయిందా? లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో ఇస్రో విక్రమ్ ల్యాండర్ ఒకటిగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తీపు కబురు అందించింది. 

ఇస్రో చేపట్టిన చంద్రయాన్2 పైనే అందరి దృష్టి. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అయినట్టేనా? అనే సందేహం వ్యక్తమవుతోంది. చంద్రుని ఉపరితలానికి చేరువగా వెళ్లిన విక్రమ్ ల్యాండర్ ఒక్కసారిగా అదృశ్యం కావడం.. సిగ్నల్స్ కట్ కావడం అందరిని షాకింగ్ గురిచేసింది. ఇంతకీ విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయిందా? లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో ఇస్రో విక్రమ్ ల్యాండర్ ఒకటిగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్టు తీపు కబురు అందించింది. 

అప్పటివరకూ నీరుగారిన ఆశలన్నీ మళ్లీ చిగురించాయి. విక్రమ్ తో సిగ్నల్స్ కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఒకవైపు ఇస్రో చెబుతూనే ఉంది. అనుకున్నట్టుగా మళ్లీ విక్రమ్ సిగ్నల్స్ అందితే మాత్రం చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ అయినట్టే. దేశవ్యాప్తంగా రెండే రెండు అంశాలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఒకటి.. చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ సిగ్నల్స్ అందుతాయా? లేవా? మరొకటి.. ట్రాఫిక్ కొత్త చట్టంతో భారీ జరిమానాల అంశం ఎక్కువగా వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. విక్రమ్ ల్యాండర్ కంటే.. ట్రాఫిక్ భారీ చలాన్ల భయమే ఎక్కువగా కనిపిస్తోంది. 

ట్రాఫిక్ కొత్త చట్టం రూల్స్ ప్రకారం.. సిగ్నల్స్ బ్రేక్ చేసినా హెల్మట్ లేకున్నా.. ఇన్సూరెన్స్ సహా సంబంధిత పత్రాలు లేకున్నా భారీగా జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలో నాగ్ పూర్ సిటీ పోలీసులు రెండు అంశాలను ఫన్నీగా ముడిపెట్టారు. విక్రమ్ ల్యాండర్ సిగ్నల్స్ బ్రేక్ చేసిందని, ట్రాఫిక్ కొత్త చట్టం ప్రకారం.. సిగ్నల్స్ బ్రేకింగ్ కింద ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇస్రో విక్రమ్ ల్యాండర్ జాడ కనిపెట్టడంతో ఫైన్ కట్టాల్సిన పనిలేదని నాగ్ పూర్ పోలీసులు ఫన్నీ ట్వీట్ చేశారు. ‘డియర్ విక్రమ్.. దయచేసి స్పందించు.. సిగ్నల్స్ బ్రేక్ చేసినందుకు నీకు చలాన్ వేయడం లేదు’ అంటూ #VikramLanderFound #ISROSpotsVikram @isro #NagpurPolice హ్యాష్ ట్యాగులు జోడించారు. 

ఇస్రో.. విక్రమ్ ల్యాండర్ ఎక్కడ ఉందో కనిపెట్టామని ప్రకటించిన అనంతరం పోలీసులు ఇలా ట్వీట్ చేశారు. నాగ్ పూర్ పోలీసుల ట్వీట్‌కు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ యూజర్ ఒకరు.. ‘నాగ్ పూర్ పోలీసులు చెప్పింది నిజమే. 133 కోట్ల మంది భారతీయుల ఆశలు #విక్రమ్ తో ముడిపడి ఉన్నాయి. అది నిజంగా మినహాయింపే. మీ ట్వీట్ అపూర్వం’ అని ట్వీట్ చేశారు. మరో యూజర్.. అవును.. ఇది నిజమే.. విక్రమ్.. ఎందరో హృదయాలను బాధపెట్టలేవు. నీ జాడ తెలియక ఎంతమంది దేశంలో కన్నీరు పెడుతున్నారో తెలియకపోవచ్చు అంటూ ట్వీట్ చేశారు. నాగ్ పూర్ పోలీసుల ట్వీట్ కు ఇప్పటివరకూ 2.1వేల కామెంట్లు రాగా 18వేలకు పైగా రీట్వీట్లు, 68వేల లైక్సు వచ్చాయి.