‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయను’

‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయను’

కేంద్రం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ ఎన్నికల్లో పోటీ చెయ్యనని పీడీపీ ప్రెసిడెంట్, మాజీ సీఎం Mehbooba Mufti శుక్రవారం అన్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర జెండా ఎగిరితేనే తాము త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తామని ఆమె చెప్పారు. 2019 ఆగష్టు 5న ఆర్టికల్ 370 రద్దుతో సివిల్ సెక్రటేరియట్ పై త్రివర్ణ పతాకంతో ఎగురుతున్న జమ్మూ కశ్మీర్ జెండాను తొలగించారు.

‘నా జెండా నా ముందే ఉంది. నా జెండా రిస్టోర్ చేశారంటే.. అప్పుడు మేం కూడా ఇతర జెండాలు (త్రివర్ణ పతాకాలు) ఎగరేస్తాం. అది జరిగేంత వరకూ మరే జెండాను మా చేతుల్లోకి తీసుకోం. మాకు ఆ జెండాతో ఉన్న బంధాన్ని ఈ జెండానే పుట్టించింది. కేవలం ఆ ఒక్క జెండాతో కాదు’ అని మెహబూబా మఫ్తీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.



14నెలల డిటెన్షన్ తర్వాత రిలీజ్ అయిన ఆమె.. జమ్మూ అండ్ కశ్మీర్ జెండా ఎగిరితేనే.. త్రివర్ణ పతాకం ఎగరేస్తాం. మాకు ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ ఎన్నికల్లో పోటీ చెయ్యం. అని.. కేంద్రం జమ్మూ అండ్ కశ్మీర్ లోని పార్టీలను తక్కువ చేయాలని చూసినా కుదరని చెప్పారు.

వారంతా దేశ రాజ్యాన్ని మార్చి బీజేపీ మ్యానిఫెస్టోగా మార్చాలనుకుంటున్నారు. ఇదెంతో కాలం సాగదు. రాజ్యాంగంలో జరిగిన మార్పులు.. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. ‘మా దగ్గర్నుంచి తీసుకుంది మళ్లీ లాక్కుంటాం. ఇది రాజకీయ యుద్ధం. మేం శాంతియుతంగానే పోరాడతాం’ అని ఆమె వెల్లడించారు.