Wont Cry: నా తండ్రి మరణం పట్ల కన్నీరు కార్చను… గన్‌మెన్‌లకు గౌరవమిచ్చినట్లే

రీనగర్‌లోని ఇఖ్బాల్ పార్క్ వద్ద అతని షాప్‌లోనే ఉన్న సమయంలో చాలా క్లోజ్ రేంజ్ లో షూట్ చేసి చంపేశారు. తండ్రి ఒక యుద్ధ వీరుడిలా బతికాడని, అలాగే ప్రాణాలు విడిచాడని నవ్వుతూ ఉంటా.

Wont Cry: నా తండ్రి మరణం పట్ల కన్నీరు కార్చను… గన్‌మెన్‌లకు గౌరవమిచ్చినట్లే

Kashmir Pandit Death(1)

Wont Cry: ధైర్యం, వీరోచితంగా పోరాడి శ్రీనగర్ మిలిటెంట్ల ఎక్కువగా ఉన్న సమయంలోనూ శ్రీనగర్ వదిలి వెళ్లేందుకు నిరాకరించిన వ్యక్తి టెర్రరిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరుసటి రోజుే తండ్రి మరణంపై కూతురు స్పందిస్తూ ‘మేం కన్నీరు కార్చం.. అలా చేయడం గన్ మెన్‌లకు ఏదో గౌరవం అందించినట్లు అవుతుంది’ అని అంటున్నారు.

మఖాన్ లాల్ బింద్రూ, 70 మంగళవారం శ్రీనగర్ లో జరిగిన వరుస ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీనగర్‌లోని ఇఖ్బాల్ పార్క్ వద్ద అతని షాప్‌లోనే ఉన్న సమయంలో చాలా క్లోజ్ రేంజ్ లో షూట్ చేసి చంపేశారు. అతని కుటుంబం ఈ దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేయగా.. కూతురు డా.సమృద్ధి బింద్రూ మాట్లాడుతూ తన తండ్రి ఒక యుద్ధ వీరుడిలా బతికాడని, అలాగే ప్రాణాలు విడిచాడని నవ్వుతూ ఉంటానని అంటున్నారు.

‘నేను పోరాడుతూ ఉండగానే చనిపోతాను’ అని ఎప్పుడూ చెప్తుండే వారు. ఆయన అలాగే చనిపోయారు. ఈ రోజున మా తండ్రి ఇక లేరు. కానీ, ఇప్పటికీ నా ముఖంపై నవ్వు చెదరదు. ఎందుకంటే నా తండ్రి ఒక యుద్ధ వీరుడు. అతనొక విజేత. నేను కన్నీరు కార్చను. అలా చేశానంటే గన్ మెన్ లను గౌరవించినట్లే అవుతుంది’ అని చెప్పారామె.

……………………………………………. : బాబోయ్.. ఈ చేప చాలా డేంజర్.. విషం చిమ్మి మనిషిని చంపేస్తుంది!

తన తండ్రి ఆమెకు భయపడకుండా బతకమని చెప్తుండేవారట. ‘ప్రతీదానికి భయపడాల్సిన అవసరం ఏముంటుంది. జీవితంలో భయంలేకుండా బతకాలి. భయపడితే చచ్చిపోయినట్లే. నువ్వెప్పుడైనా భయపడ్డావా అని మా తండ్రిని అడుగుతుండేదాన్ని. దానికి ఆయన చెప్పిన సమాధానం నేను భయపడుతూ ఉంటే ప్రతి రోజూ చచ్చిపోతూనే ఉంటా. అలా కాకుండా చచ్చిపోయానంటే ఒక్కసారే చనిపోయినట్లు’ అని ఆమె తండ్రి మాటలు గుర్తు చేసుకున్నారు.

ఒక గంటలో జరిగిన దుర్ఘటనలో మరో ఫుడ్ వెండర్ తో పాటు, క్యాబ్ డ్రైవర్ కూడా చనిపోయారు.