వ్యాక్సిన్ వేసుకోవడానికి రెడీగా ఉండండి.. బలవంతమేమీ లేదు: కేంద్ర మంత్రి

వ్యాక్సిన్ వేసుకోవడానికి రెడీగా ఉండండి.. బలవంతమేమీ లేదు: కేంద్ర మంత్రి

COVID-19 vaccination మీకు ఇష్టమైతేనే చేయించుకోండి అందులో ఎటువంటి బలవంతం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్ష్ వర్ధన్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి హెల్త్ వర్కర్ల వరకూ అందుబాటులో ఉండేలా వ్యాక్సిన్ ను రెడీ చేస్తున్నారు. న్యూ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆరోగ్య శాఖ మంత్రి వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరించారు.

మహమ్మారి ప్రభావం అయిపోయినట్లేనా అని అడిగిన ప్రశ్నకు మాట్లాడిన మంత్రి.. ‘నేనూ అదే అనుకుంటున్నా. మన దేశంలో మూడు లక్షల యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఐదు నెలల క్రితం 10లక్షల కేసులు ఉన్నాయి. మొత్తం పది కోట్ల కేసుల వరకూ ఫేస్ చేశాం. 95లక్షల మందికి పైగా రికవరీ అయ్యారు. ప్రపంచంలోనే మనకు అత్యధిక రికవరీ రేటు ఉంది’

‘దారుణమైన పరిస్థితులను దాటేశామని అనుకుంటున్నా. కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాలి. మహమ్మారి పట్ల రిలాక్స్ తో ఉండి రిస్క్ కొని తెచ్చుకోలేం. మాస్కులు తప్పక ధరించాలి. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండి ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి’ అని అన్నారు.

కొవిడ్ వ్యాక్సిన్ పై ఫోకస్ పెట్టిన కేంద్ర ఆరోగ్య మంత్రి.. తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత వ్యాక్సిన్ భద్రత, ఎఫెక్టివ్‌నెస్ మీదే ఉందని అన్నారు. జనవరిలో కచ్చితంగా ఇండియాలో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు.