కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గేవరకు స్కూళ్లు తెరవద్దు ప్లీజ్.. కేంద్రానికి పేరెంట్స్ రిక్వెస్ట్.. పిటిషన్‌పై సంతకాలు

  • Published By: vamsi ,Published On : June 2, 2020 / 02:52 AM IST
కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గేవరకు స్కూళ్లు తెరవద్దు ప్లీజ్.. కేంద్రానికి పేరెంట్స్ రిక్వెస్ట్.. పిటిషన్‌పై సంతకాలు

జూలైలో పాఠశాలలను తిరిగి తెరవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఈ చర్యకు వ్యతిరేకంగా ‘పేరెంట్స్ అసోసియేషన్’ అని పిలువబడే ఒక బృందం ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించింది. కరోనా కేసులు సున్నాకు చేరుకునేవరకు, తమ పిల్లలను పాఠశాలలకు పంపించకూడదని నిర్ణయించారు.

అంతేకాదు.. కరోనాకు వ్యాక్సిన్‌ సిద్ధమయ్యే వరకు గానీ, దేశంలో కేసులు సున్నాకు చేరుకునేవరకు పాఠశాలలు ప్రారంభించొద్దని కేంద్రానికి 2.13 లక్షల మంది తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక పిటిషన్‌పై వారు సంతకాలు చేశారు.  జూలైలో విద్యా సంస్థలు తెరిస్తే పరిస్థితి దారుణమవుతుందని తల్లిదండ్రులు ఆ పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కోవిడ్ -19 కేసులు లేదా వ్యాక్సిన్ లభించేలోపే పాఠశాలలు తెరవడం మంచి ఆలోచన కాదని, పిచ్చి చర్యగా వారు అభివర్ణించారు. ఈ చర్య అగ్నితో ఆడుకోవడం లాంటిదే అని వారు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు ఈ మూర్ఖత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఒక్క బిడ్డను కూడా పాఠశాలలకు పంపించకూడదని, ”change.org” పిటిషన్‌లో వారు నివేదించారు. వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లో తరగతులు నిర్వహించాలని సూచనలు చేశారు.

Read: మంచి దొంగ:  బైక్‌ను దొంగలించి తిరిగి పార్శిల్ ద్వారా పంపాడు