నీళ్లు ఇచ్చి.. పంజాబ్‌ను ఎడారి చేసుకోలేం: మోడీతో మాట్లాడతాం

నీళ్లు ఇచ్చి.. పంజాబ్‌ను ఎడారి చేసుకోలేం: మోడీతో మాట్లాడతాం

నది నీళ్లు పక్క రాష్ట్రాలతో పంచుకుని పంజాబ్‌ను ఎడారి చేసుకోలేమంటున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌నాథ్ సింగ్. గురువారం అన్ని పార్టీలతో మీటింగ్‌కు హాజరైన ఆయన నది నీళ్లు పంచుకోవడం కుదరదనే తీర్మానం చేసుకున్నారు. తద్వారా నది నీటిమట్టం తగ్గడమే కాకుండా.. తర్వాతి కాలంలో నీటి ఎద్దడి సంభవిస్తుందనే ఆందోళనను వ్యక్తపరిచారు. 

దీనిపై వివరణ ఇచ్చేందుకు ఇరిగేషన్ మినిస్టర్ సుఖ్‌వీందర్ సింగ్ సర్కారియాతో కలిసి మోడీతో మాట్లాడి ఎడారిగా మారే పరిస్థితి ఉందని వివరించనున్నట్లు ఆయన అన్నారు. ‘నీటి పారుదల శాఖ అవసరాల రీత్యా 73శాతం నీరు కావాల్సి ఉంటుంది.  ఆ స్థాయి తగ్గిపోయి ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇంకా నీరు ఇతర రాష్ట్రాలతో పంచుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. అలా జరిగితే. రైతులకు, పేదలకు ఇచ్చేందుకు నీరు మిగలదు.  అంతర్జాతీయంగా ఒప్పందమైన రిపారియన్ నియమం ప్రకారం.. బేసిన్ నుంచి ఆ మూడు(రవి, సుట్లేజ్, బీస్) నదుల నాన్ బేసిన్ ప్రాంతాలకు నీరు పంపడం కుదరదు’ అని తెలిపారు. 

ఇది పూర్తిగా ఎస్వైఎల్ కెనాల్ అంశం అని పూర్తిగా చెప్పలేం. కేంద్రంతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోనుంది పంజాబ్. ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ ప్రెసిడెంట్‌లు అయిన భగవంత్ మాన్, సుఖ్వీందర్ సింగ్ బాదల్ మీటింగ్‌కు హాజరుకాలేదు. ఈ అంశంలో అమరీందర్ నాథ్‌కు మద్ధతుగానే నిలిచారు కాంగ్రెస్ నాయకులు కూడా.