Mallikarjun Kharge: అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఖర్గే చేసిన ‘రావణ్’ వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకురాలి నుంచి విమర్శ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రావణుడిగా పేర్కొంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ మాజీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. మనం మాట్లాడే విషయాలపై జాగ్రత్త వహించాలని, పదాలను తప్పుగా వాడితే మనం ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇవ్వలేమని అన్నారు.

Mallikarjun Kharge: అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఖర్గే చేసిన ‘రావణ్’ వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకురాలి నుంచి విమర్శ

Mallikarjun Kharge: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రావణుడిగా పేర్కొంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ మాజీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. మనం మాట్లాడే విషయాలపై జాగ్రత్త వహించాలని, పదాలను తప్పుగా వాడితే మనం ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇవ్వలేమని అన్నారు.

తాను చెబుతున్న ఈ విషయం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదని, అన్ని పార్టీలకూ చెబుతున్నానని అన్నారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ… తాను ప్రస్తుతం ప్రజల మధ్యే ఉన్నానని, ఏడాది తర్వాత చూద్దామని చెప్పారు. ముంతాజ్ పటేల్ తాజాగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

Ricky Ponting: కామెంటరీ చేస్తున్న సమయంలో రికీ పాంటింగ్‌కు గుండెపోటు?.. ఆసుపత్రికి తరలింపు

మోదీ బలమైన నాయకుడని చెప్పడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదని, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉందని చెప్పారు. ఆమె మోదీని పొగడడంతో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ముంతాజ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, ‘‘మోదీజీ మన ప్రధానమంత్రి. ఆయన తన విధులను మరచి, కార్పొరేషన్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఎల్లప్పుడు తన గురించే మాట్లాడతారు. తనను చూసి ఓటేయాలని చెబుతారు. ఆయనను ఎన్నిసార్లు చూడాలి. ఆయనకు రావణుడిలా అనేక తలలు ఉన్నాయా?’’ అని ఖర్గే ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయనకు ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..