Anna Hazare: ఢిల్లీ ప్రభుత్వం నుంచి మద్యం పాలసీనా..? కేజ్రీవాల్ మాటలకు.. చేతలకు సంబంధం లేదు: అన్నా హజారే

అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుందని తాను ఊహించలేదన్నారు ఉద్యమకర్త అన్నా హజారే. కొత్త మద్యం పాలసీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ అన్నా హజారే రెండు పేజీల లేఖ రాశారు.

Anna Hazare: ఢిల్లీ ప్రభుత్వం నుంచి మద్యం పాలసీనా..? కేజ్రీవాల్ మాటలకు.. చేతలకు సంబంధం లేదు: అన్నా హజారే

Anna Hazare: ఢిల్లీ ప్రభుత్వం నుంచి మద్యం పాలసీని తాను ఊహించలేదని, సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం లేదని విమర్శించారు సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే. వచ్చే నెల 1 నుంచి ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ అమలవ్వబోతున్న సంగతి తెలిసిందే.

Jaishankar: సరిహద్దు అంశం మీదే.. భారత్-చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి: విదేశాంగ మంత్రి జైశంకర్

దీనిపై ఇప్పటికే అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీన్ని విమర్శిస్తున్న వారి జాబితాలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా చేరారు. ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రెండు పేజీల లేఖ రాశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ‘‘ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా నిలిచిన లోక్‌పాల్, లోకాయుక్తను మీరు (అరవింద్ కేజ్రీవాల్) ముఖ్యమంత్రి అయ్యాక మర్చిపోయారు. అసెంబ్లీలో ఒక్కసారి కూడా లోకాయుక్తను తెచ్చేందుకు ప్రయత్నించలేదు. ఇప్పుడు మీరు తెస్తున్న మద్యం పాలసీ ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంది. ముఖ్యంగా మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Revanth Reddy: ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయడమే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా: రేవంత్ రెడ్డి

దీన్నిబట్టి మీ మాటలకు.. చేతలకు సంబంధం లేదని తెలుస్తోంది. నేను మహారాష్ట్రలాంటి మద్యం పాలసీ తెస్తారేమో అని ఊహించా. కానీ, కొత్త మద్యం పాలసీ తెచ్చారు. ప్రజలు అధికారం, డబ్బు వలలో చిక్కుకున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీకి ఇలాటి నిర్ణయాలు తగదు’’ అని అన్నా హజారే తన లేఖలో పేర్కొన్నారు.