శాలరీ సమస్యలతో iPhone మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ధ్వంసం చేసిన వర్కర్లు

శాలరీ సమస్యలతో iPhone మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ధ్వంసం చేసిన వర్కర్లు

Wistron iPhone manufacturing unit : తైవాన్‌లో హెడ్ క్వార్టర్స్ ఉన్న విస్ట్రన్ కార్పొరేషన్ వర్కర్లు ఫైర్ అయ్యారు. ఐఫోన్ తయారీ సంస్థపై శనివారం ఆందోళనకు దిగారు. శాలరీ సమస్యతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక సమచారం ప్రకారం.. కోలార్ జిల్లాలోని నరసాపురా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి 51కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.

43 ఎకరాల విస్తీర్ణలో ఉన్న ప్లాంట్ బయట పార్క్ చేసి ఉంచిన కార్లు, ఫర్నిచర్ ను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. రూ.2వేల 900కోట్లు కేటాయించి 10వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆశ చూపిన మేనేజ్మెంట్ నిరుత్సాహానికి గురిచేసిందని వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు, అద్దాలు పగలగొట్టి, వాహనాలు చెడగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పాడుచేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనకు శాలరీ సమస్యలే కారణమని అంటున్నారు. దాదాపు 2వేల మందికి పైగా ఉద్యోగులు.. ఆందోళనలో పాల్గొన్నారు. నైట్ షిఫ్ట్ పూర్తి అయిన తర్వాత ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్నట్లు కంపెనీ ఇచ్చిన సమాచారం. ఘటనపై కంపెనీ ఎటువంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.

ఓ ట్రేడ్ యూనియన్ లీడర్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. అందులో చాలా మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ మీదే పనిచేస్తున్నారని.. అంతేకాకుండా వారి శాలరీలో చాలా రకాల కోతలు విధిస్తూ వచ్చిందని కంపెనీపై ఆరోపించారు. ఇవ్వాల్సిన జీతాలు సకాలంలో చెల్లించకపోవడం వంటివి సమస్యలుగా మారాయి.

విస్ట్రన్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ నుంచి యాపిల్ ఐఫోన్, ఐటీ ప్రొడక్ట్ లు అయిన లెనోవా, మైక్రోసాఫ్ట్ లాంటివి ఉత్పత్తి అవుతుంటాయి.

పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఓ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కు నెల జీతం రూ.21వేలు ఇస్తామని హామీ ఇచ్చి అతనికి రూ.16వేల జీతం మాత్రమే ఇచ్చేవారు. ఇటీవలి నెలల్లో అది రూ.12వేలు మాత్రమే అందేది. నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ జీతం రూ.15వేల నుంచి రూ.8వేలకు పడిపోయింది. ప్రాథమిక విచారణ జరుగుతుందని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు.