వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ :7.5శాతానికి దేశ జీడీపీ గ్రోత్

భారత్ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనావేసింది.2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP గ్రోత్ 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2019 / 01:07 PM IST
వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ :7.5శాతానికి దేశ జీడీపీ గ్రోత్

భారత్ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనావేసింది.2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP గ్రోత్ 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

భారత్ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనావేసింది.2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP గ్రోత్ 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో పెట్టుబడులు పటిష్టమవడం,ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఎగుమతుల వృద్ధి చెందుతుడటం, వినియోగం సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి, నిలదొక్కుకోవడం దీనికి కారణాలని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.2018-19 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ గ్రోత్ రేటు 7.2 శాతమని ఆదివారం(ఏప్రిల్-7,2019) విడుదల చేసిన రిపోర్ట్ లో వరల్డ్ బ్యాంక్ తెలిపింది.వరల్డ్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) సంస్థ స్ప్రింగ్ మీటింగ్ త్వరలో జరగబోతున్న సమయంలో ఆదివారం ప్రపంచ బ్యాంకు ఈ వివరాలను ప్రకటించింది.
Read Also : BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం
 
మొదటి మూడు క్వార్టర్ట్స్ కు సంబందించిన డేటాను బట్టి విస్తృత స్థాయిలో వృద్ధి జరుగుతున్నట్లు తేలిందని తెలిపింది.ఇండస్ట్రియల్ గ్రోత్ 7.9 శాతానికి చేరిందని, వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధితో పటిష్టమైందని తెలిపింది. డిమాండ్‌ ను పరిశీలించినపుడు…దేశీయ వినియోగం ప్రైమరీ గ్రోత్ డ్రైవర్ గా ఉందని తెలిపింది. స్థిర మూలధనం, ఎగుమతులు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలిపింది. చివరి క్వార్టర్ లో అన్ని రంగాల్లోనూ వృద్ధి సమతూకంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.2018-19 ఆర్థికసంవత్సరంలో దాదాపుగా ద్రవ్యోల్బణం తగ్గిందని రిపోర్ట్ తెలిపింది.
Read Also : Paytm మాల్ ప్లాన్ : 300 మంది ఉద్యోగులు కావాలి