యూపీలో : వరల్డ్ బిగ్గెస్ట్ టెంపరరీ సిటీ 

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 10:40 AM IST
యూపీలో : వరల్డ్ బిగ్గెస్ట్ టెంపరరీ సిటీ 

ఉత్తరప్రదేశ్ : ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం (టెంపరరీ సిటీ) ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. దీనికి ప్రయాగ్ వేదికయ్యింది. యూపీలో జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం వేడుగ జరగనున్న క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని నిర్మించింది. యాత్రికులకు..భక్తులకు స్వాగతం పలికేందుకు ప్రయాగ్ రాజ్ సిద్ధమైంది. ఈ ఉత్సవాలకు కోట్లాది మంది హాజరుకానుండటంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు రూ. 2,800 కోట్లను కేటాయించింది. దీనికి మొత్తం ఖర్చు రూ. 4,300 కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

టెంపరరీ సిటీ స్పెషల్ 
250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు..22 పంటూన్ వంతెనలు తాత్కాలిక నగరం కోసం నిర్మించింది. మొత్తం 40 వేల ఎల్ఈడీ బల్బులు ఈ నగరం వెలిగిపోనుంది. ఈ ఉత్సవాలకు భద్రత కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పటికే ప్రారంభం కాగా..టెంపరరీ సిటీ మొత్తాన్నీ సీసీటీవీ కెమెరాల నిఘాలో వుంది. 
ట్రాఫిక్ కు ఇబ్బందులు..భక్తులు నది వద్దకు రావటం వెళ్లటం..ట్రాఫిక్ డైవర్షన్  వంటి పలు కీలక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సర్కార్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షణ  వుంటుంది.  మొత్తం 20 వేల మంది భద్రతా సిబ్బంది విధులను నిర్వర్తించనుంది. కుంభమేళాలో భద్రతా విభాగంలోని పోలీసులు శాకాహారం మాత్రమే తీసుకుంటారని, మద్యం ముట్టరనీ..యూపీ డీజీపీ కేపీ సింగ్ తెలిపారు. జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం కానుండగా, 192 దేశాల నుంచి సుమారు 12 కోట్ల మంది వరకూ వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.