India : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వే నిర్మాణం
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టింది భారత ప్రభుత్వం.. ఇది ఢిల్లీ నుంచి ముంబై మధ్య నిర్మాణమవుతోంది.

India
India : ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టింది భారత ప్రభుత్వం.. ఇది ఢిల్లీ నుంచి ముంబై మధ్య నిర్మాణమవుతోంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ప్రెస్ వే వివరాలు వెల్లడించారు. 1380 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఢిల్లీ – ముంబైల మధ్య ప్రయాణ సమయం తగ్గిస్తుందని తెలిపారు. ఇది నవి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (JNPT) వరకు వెళ్తుందని, అయితే.. దీన్ని నారిమన్ పాయింట్ వరకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.
Read More : Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!
గతంలో ఈ రెండు మెట్రో నగరాల మధ్య ట్రక్ ప్రయాణానికి 48 గంటలు.. కారులో వెళ్ళాలి అంటే 24-26 గంటల సమయం పట్టేదని ఇప్పుడు ఈ సమయం సగానికి పైగా తగ్గుతుందని తెలిపారు. కారులో కేవలం 12 – 13 గంటల్లో ప్రయాణం పూర్తి చేయొచ్చని, ఇక ట్రక్ 18-20 గంటల్లో చేరుకుంటుందని తెలిపారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని గిరిజన జిల్లాల నుంచి ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరుగుతోందని, దీంతో ఆయా ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజలకు అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని వెల్లడించారు.
Read More : Odisha Artist : ఆహార ధాన్యాలతో 8 ఫీట్ల మోదీ చిత్రం..ఒడిశా కళాకారిణి ప్రతిభ