‘Ganga Vilas’ : 5 రాష్ట్రాలు,27 నదుల మీదుగా వారణాసి to దిబ్రూగడ్‌ వయా బంగ్లాదేశ్ ‘గంగా విలాస్’ ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక..!!

5 రాష్ట్రాలు,27 నదుల మీదుగా,51 రోజుల పాటు 3వేల 2 వందల కిలోమీటర్ల పాటు ఈ నౌకావిహారం ఉంటుంది. వారణాసి to దిబ్రూగడ్‌ వయా బంగ్లాదేశ్ తిరిగి అస్సోం చేరుకుంటుందీ ‘గంగా విలాస్’ నౌక. ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది. ఈ నౌక ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.

World Longest River Cruise, ‘Ganga Vilas’ : ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ క్రూయిజ్… గంగా విలాస్.. ఈ నెల 13 నుంచి అందుబాటులోకి రాబోతోంది. దేశంలో ఎన్నో క్రూయిజ్‌లున్నా అంతకుమించి అన్నట్లు దీనికెందుకంత క్రేజ్ ను సంతరించుకుంది. ప్రపంచ పర్యాటక పటంపై భారతీయతను చాటే ఈ క్రూయిజ్‌ లో ఎన్నో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 5 రాష్ట్రాలు..3,200 కిమీటర్లు… 51 రోజులు..వారణాసి టు దిబ్రూగడ్‌ వయా బంగ్లాదేశ్,ఒకటి కాదు రెండు కాదు 27 నదుల మీదుగా కొనసాగే అత్యద్భుతానుభూతిని ఇచ్చే ప్రయాణం. పవిత్ర వారణాసితో మొదలై వారసత్వ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది ఈ గంగా విలాస్ ప్రయాణం. భారతీయతను ప్రపంచానికి చాటే సరికొత్త మార్గం అని చెప్పి తీరాల్సిందే.

గంగా విలాస్‌ ప్రత్యేకతల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నదీజలాల్లో సుదీర్ఘంగా సాగే ఈ యాత్ర ఏకంగా 51 రోజుల పాటు 3వేల 2 వందల కిలోమీటర్ల పాటు ఈ నౌకావిహారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో మొదలై ఐదు రాష్ట్రాల మీదుగా సాగుతుంది. అంతేకాదు బంగ్లాదేశ్‌ జలాల్లోనూ విహరించడం ఈ నౌకకున్న మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ 51రోజుల్లో ఇది 27 నదులమీదుగా ముందుకు సాగుతుంది. దేవనదిగా పిలుచుకునే గంగలో ప్రయాణం మొదలుపెట్టి చివరకు బ్రహ్మపుత్ర నదితో ముగుస్తుంది. వారణాసి నుంచి మొదలుకానున్న ఈ గంగా విలాస్ ప్రస్థానం… గాజీపూర్, బక్సార్, పాట్నా మీదుగా కోల్‌కతాకు సాగుతుంది. అక్కడ్నుంచి బంగ్లాదేశ్ నదీజలాల్లోకి ప్రవేశిస్తుంది. 15రోజుల పాటు బంగ్లా రాజధాని డాకా సహా పలు పట్టణాలను స్పృశిస్తూ మళ్లీ భారత్‌లోకి ప్రవేశించి అసోంలోని దిబ్రూగడ్‌కు చేరుతుంది ఈ క్రూయిజ్… ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది.

గంగా విలాస్‌ను కేవలం నదీ ప్రయాణంగా మాత్రమే చూడలేం..!! ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ క్రూయిజ్‌ను ఏర్పాటు చేయడం వెనుక ప్రభుత్వానికి ఓ సంకల్పం ఉంది..!! కేవలం వినోదం..విహారం మాత్రమే కాదు.. రెండు దేశాల మధ్య సాంస్కృతి బంధాన్ని ప్రపంచానికి చాటడం.. దానితో పాటు యూరోప్ స్థాయికి రివర్ క్రూయిజ్ టూరిజాన్ని తీసుకెళ్లడం…!! ఈ లక్ష్యాలను చేరుకుంటే.. భారతీయ పర్యాటకం నౌకా విహారంలో సరికొత్త చరిత్రను లిఖించడం ఖాయం…

World Longest River Cruise ‘Ganga Vilas’ : ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ క్రూయిజ్..‘గంగా విలాస్’..జనవరి 13న జెండా ఊపి ప్రారంభించినున్న ప్రధాని మోడీ

భారత దేశం అంటేనే జీవ వైవిధానికి కేంద్రం…. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారే కొద్దీ వాతావరణం, జీవన విధానం, ఆహారపుటలవాట్లు ఇలా అన్నీ మారిపోతుంటాయి. వాటన్నింటినీ నదీయానం ద్వారా పరిశీలించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది గంగా విలాస్ జర్నీ. దేశంలో ఎన్నో దర్శనీయ స్థానాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. వీటన్నింటినీ చూడటం ఒక ఎత్తైతే.. 27 నదులను దాటుకుంటూ… రివర్ క్రూయిజ్ ద్వారా.. రెండు దేశాల మధ్య నదీ పరివాహక ప్రాంతాల్లో అడుగుపెట్టడం గొప్ప అనుభూతినిస్తుంది…స్పాట్

పవిత్ర గంగానది పరివాహక ప్రాంతంలో సుసంపన్న నాగరికత విలసిల్లిన ప్రాంతాలను సందర్శించడానికి విదేశీ పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. అలాంటి వారిని గంగా విలాస్ క్రూయిజ్ జర్నీ కొత్త తీరాలకు చేర్చుతుంది. కాశీ నుంచి సార్‌నాధ్‌ వరకు… మజులి నుంచి మయాంగ్ వరకు,సుందర్‌బెన్‌ నుంచి ఖజీరంగా వరకు ఆధ్యాత్మికం, వైజ్ఞానికం కలసివచ్చేలా సాగే యాత్రలు ఓ జీవితానికి సరిపడా అనుభవాలను పంచుతాయి. భారతీయ అందాలతో పాటు ఆధ్యాత్మిక, నాగరికతను తెలుసుకునేందుకు అధ్యయనం చేసేందుకు విదేశీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిని సాదరంగా వారణాసికి ఆహ్వానించి… 51 రోజుల పాటు 27 నదీ మార్గాల ద్వారా ప్రయాణం చేయించి.. భారతీయ వైభవాన్ని వివరిస్తే…మన ఖ్యాతి ప్రపంచ విఖ్యాతమవుతుంది…స్పాట్

వాస్తవానికి మనదేశం ఇప్పటి వరకు విలాసవంతమైన రివర్ క్రూయిజ్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. దేశంలో 8విలాసవంతమైన రివర్ క్రూయిజ్‌లు ఉంటే.. అవి కోల్‌కతా- వారణాసి మధ్య మాత్రమే నడుస్తున్నాయి. తొలిసారిగా గంగా విలాస్ రూపంలో దేశ సరిహద్దులను దాటుతోంది రివర్ క్రూయిజ్. దేశ విదేశీ పర్యాటకులను రివర్ క్రూయిజ్‌కు ఆహ్వానిస్తే… భారతీయ పర్యాటకంలో నౌకా విహారానికి సరికొత్త ఊపిరిలూదుతుంది.

రివర్ క్రూయిజ్ ద్వారా చిన్న చిన్న దేశాలు కూడా పెద్దగా మార్కెటింగ్ చేసుకుంటుంటే.. ఇప్పటి వరకు మనం ఆవిషయంలో వెనుకపట్టాం. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రివర్ టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయడం మొదలు పెట్టింది. దీని ద్వారా మన సాంస్కృతిక , ఆధ్యాత్మిక, వైజ్ఞానిక విశిష్టతలను ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చు.. దేశీయంగా ఉపాధి అవకాశాలను కూడా పెంచుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ ద్వారా ప్రభుత్వం అదే పనిచేస్తోంది….

ప్రపంచవ్యాప్తంగా రివర్‌ క్రూయిజ్ మార్కెట్ గత కొన్నేళ్లలో 5శాతం పెరిగింది. అయితే 2027 నాటికి మొత్తం క్రూయిజ్ మార్కెట్‌లో రివర్ క్రూయిజ్ వాటా 37శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి రివర్ క్రూయిజ్ లో యూరోప్ ముందుంది. ప్రపంచంలోని 60శాతం రివర్ క్రూయిజ్ లు యూరోప్ లోనే ఉన్నాయి. దేశీయంగా వివిధ ప్రాంతాల మధ్య రివర్ క్రూయిజ్ జర్నీలను పెంచడం ద్వారా భవిష్యత్తులో యూరోప్ తరహా మార్కెట్‌ను సాధించే శక్తి మనకు కచ్చితంగా ఉంది. ఒకరకంగా దేశీయ పర్యాటక రంగం పునరుజ్జీవనానికి రివర్ టూరిజం సర్క్యూట్లు కీలక పాత్ర పోషిస్తాయి. గంగా విలాస్ రివర్ క్రూయిజ్ ప్రాజెక్టు.. ఒక రకంగా భారతీయ పర్యాటకం రూపు రేఖలు మార్చేయబోతోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు