కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల ప్రపంచ రికార్డు

పారిశుద్ధ్య కార్మికుల ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ అరుదైన రికార్డుకు కుంభమేళా  వేదికయయ్యింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో 10 వేల మంది కార్మికులు ఒకేసారి పరిశుభ్రతా చర్యలు చేపట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీనిని గిన్నిస్ బుక్ నమోదు చేసింది. 

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 04:31 AM IST
కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల ప్రపంచ రికార్డు

పారిశుద్ధ్య కార్మికుల ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ అరుదైన రికార్డుకు కుంభమేళా  వేదికయయ్యింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో 10 వేల మంది కార్మికులు ఒకేసారి పరిశుభ్రతా చర్యలు చేపట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీనిని గిన్నిస్ బుక్ నమోదు చేసింది. 

ప్రయాగ్‌రాజ్: పారిశుద్ధ్య కార్మికుల ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ అరుదైన రికార్డుకు కుంభమేళా  వేదికయయ్యింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో 10 వేల మంది కార్మికులు ఒకేసారి పరిశుభ్రతా చర్యలు చేపట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీనిని గిన్నిస్ బుక్ నమోదు చేసింది. 
 
ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా..ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ఈ కుంభమేళా మహాశివరాత్రి పుణ్యస్నానాలతో కుంభమేళా ముగియనుంది. ప్రస్తుత కుంభమేళాలో మూడు రికార్డులు నమోదయిన క్రమంలో పారిశుద్ధ్య కార్మికుల రికార్డు విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ మూడు రికార్డులలో 10 వేల మంది కళాకారులు ఒకేసారి పెయింటింగ్ వేయడం..503 షటిల్ బస్సులు ఒకేసారి కుంభమేళాకు రావడం ఉన్నాయి. ఈ రెండు కూడా గిన్నిస్ బుక్‌లో నమోదయ్యాయి. 
 
ఈ అంశంపై యూపీ మంత్రి సిద్దార్థ్ నాథ్ మాట్లాడుతూ 10 వేలకు మించి కార్మికులు ఒకేసారి కుంభమేళా జరుగుతున్న వివిధ ప్రాంతాలలో పరిశుభ్రతా చర్యలు చేపట్టారనీ..ఇది కుంభమేళాలో స్వచ్ఛతా నినాదానికి ప్రతిరూపంగా నిలిచిందన్నారు. కాగా..ఈ  రికార్డుకు ముందు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒకేసారి ఏడువేలమంది కార్మికులు పరిశుభ్రతా చర్యలు చేపట్టి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.