భారత ఎకానమీకి పెద్ద దెబ్బ : 21రోజుల లాక్ డౌన్ ఖరీదు రూ. 8లక్షల కోట్లు

  • Published By: venkaiahnaidu ,Published On : April 13, 2020 / 02:15 PM IST
భారత ఎకానమీకి పెద్ద దెబ్బ : 21రోజుల లాక్ డౌన్ ఖరీదు రూ. 8లక్షల కోట్లు

కరోనా వైరస్ ను కట్టడికి ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా, ముందుగానే మేల్కొన్న భారత్..21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద షట్ డౌన్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. విమాన సర్వీసులు నిలిచిపోయాయి.రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డాయి. వాహనాలు,మనుషుల కదలికపై ఆంక్షలు విధించబడ్డాయి.

అయితే ఈ 21 రోజుల లాక్ డౌన్ కారణంగా భారత ఎకానమీకి 7-8లక్షల కోట్ల రూపాయల నష్టం ఉండవచ్చని విశ్లేషకులు,పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. COVID-19 వ్యాప్తిని నిలువరించేందుకు ప్రధాని మోడీ మార్చి-25నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించారు. దేశవ్యాప్త లాక్ డౌన్ కు ముందే దేశీయ,అంతర్జాతీయ విమానసర్వీసులను నిలిపివేశారు. విదేశాల నుంచి సముద్రమార్గాల ద్వారా వచ్చే షిప్ ల రాకపోకలను నిలిపేశారు.

లాక్ డౌన్ తో దాదాపు 70శాతం ఆర్థిక కార్యకలాపాలు,పెట్టుబడులు,ఎగుమతులు,స్వేచ్ఛా వినియోగాలు నిలిచిపోయాయి. అయితే కేవలం వ్యవసాయం,మైనింగ్,యుటిలిటీ సర్వీసెస్,కొన్ని ఫైనాన్సియల్ మరియు ఐటీ సర్వీసులు మరియు పబ్లిక్ సర్వీసెస్ వంటి ఎసెన్షియల్(ముఖ్యమైన)గూడ్స్ అండ్ సర్వీసులు మాత్రమే లాక్ డౌన్ నుంచి మినహాయింపు పొందాయి.

అయితే భారతదేశానికి కరోనా మహమ్మారి చాలా అప్రధానమైన సమయంలో వచ్చిందని. ధైర్యమైన ఆర్థిక / ద్రవ్య చర్యల తరువాత ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలను చూపుతున్న సమయంలో దేశంలోకి కరోనా వచ్చింది. 2021ఆర్థిక సంవత్సరానికి(ఏప్రిల్-2020 నుంచి మార్చి2021 వరకు) తక్కువగా సింగిల్ డిజిట్ గ్రోత్(వృద్ధి)ని  దేశం మళ్ళీ చూసే అవకాశముందని సెంట్రమ్ ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్ తెలిపింది. దేశవ్యాప్తగా పూర్తి లాక్ డౌన్ తో…కనీసం 7-8 ట్రిలియన్ రూపాయలను దేశం కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. 2020ఆర్థికసంవత్సరానికి తమ జీడీపీ అంచనాలను 5.2శాతం నుండి 3.1శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది.

ఈ నెల ప్రారంభంలో, ఎక్వౌట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్(Acuite Ratings & Research Ltd)ప్రతిరోజూ భారత ఎకానమీపై లాక్ డౌన్ ఖరీదు దాదాపు 4.64బిలియన్లు(35వేల కోట్లు పైనే)ఉంటుందని అంచనా వేసింది. మొత్తం 21రోజుల లాక్ డౌన్ ఖరీదు భారత ఎకానమీపై 98బిలియన్ డాలర్ల(7.5లక్షల కోట్లు)జీడీపీ నష్టం ఉంటుందని అంచనా వేసింది.  లాక్ డౌన్ కారణంగా భారతలోని ట్రాన్స్ పోర్ట్,హోటల్,రెస్టారెంట్,రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపై తీవ్రమైన ప్రభావం చూపించింది. 

ఏప్రిల్-1నుంచి ప్రారంభమైన 2020-21ఆర్థికసంవత్సరంలో భారత ఎకానీమీ వృద్ధి 1.5నుండి2.8శాతం వరకు ఉంటుందని ఆదివారం వరల్డ్ బ్యాంకు చెప్పింది. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటి నుంచి  మందకొడిగా వృద్ధి రేటు(slowest growth rate) నమోదుకానుండటం ఇదే కానుంది.

మరోవైపు గత నెలలో ప్రధాని ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ ఏప్రిల్-14న ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడింగింపుపై మంగళవారం ఉదయం 10గంటలకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 

Also Read | మహిళాఏలుబడిలోని దేశాలే…కరోనాను తొక్కిపెట్టి…అంతం చేస్తున్నాయి