Wrestlers Protest: ‘ముందు స్టేజీ దిగండి’.. రెజ్లర్ల నిరసనలో బృందా కారత్ సహా లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం

రెజ్లింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్‭కు వ్యతిరేకంగా రెండు రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. రెండవ రోజు కొంత మంది లెఫ్ట్ నేతలతో బృందా కారత్ అక్కడికి వచ్చిన సందర్భంలో ఇది జరిగింది. కారత్ పక్కనున్న ఒకావిడ తన ఆర్గనైజేషన్ పేరుతో ఉన్న ఒక పోస్టర్ ప్రదర్శించారు. అక్కడే ఉన్న మరొకరు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Wrestlers Protest: ‘ముందు స్టేజీ దిగండి’.. రెజ్లర్ల నిరసనలో బృందా కారత్ సహా లెఫ్ట్ నేతలకు చేదు అనుభవం

Wrestler Asks Politician Brinda Karat To Leave Stage - "It's Athletes' Protest"

Wrestlers Protest: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నేత బృందా కారత్ సహా ఇతర లెఫ్ట్ నేతలకు గురువారం దేశ రాజధానిలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లకు వారు మద్దతు తెలిపారు. అయితే, వారితో పాటే స్టేజీపై నిల్చున్న బృందా కారత్ సహా ఇతర లెఫ్ట్ నేతలను ‘స్టేజీ దిగిపోండి’ అంటూ రెజ్లర్లు సూచించడం గమనార్హం. వాస్తవానికి రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకే వారు అక్కడికి వచ్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం రెజ్లర్లను అసంతృప్తికి గురి చేసింది. దీంతో వారిని స్టేజీ మీద నుంచి దిగిపొమ్మంటూ సూచించారు. అంతే కాకుండా తమ ఆందోళనను రాజకీయం చేయొద్దని కోరారు.

Amritsar: ప్రయాణికుల్ని వదిలేసి ఐదు గంటల ముందే వెళ్లిపోయిన విమానం.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

రెజ్లింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్‭కు వ్యతిరేకంగా రెండు రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. రెండవ రోజు కొంత మంది లెఫ్ట్ నేతలతో బృందా కారత్ అక్కడికి వచ్చిన సందర్భంలో ఇది జరిగింది. కారత్ పక్కనున్న ఒకావిడ తన ఆర్గనైజేషన్ పేరుతో ఉన్న ఒక పోస్టర్ ప్రదర్శించారు. అక్కడే ఉన్న మరొకరు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘దయచేసి స్టేజీ దిగి కిందకు వెళ్లిపోండి. దీన్ని రాజకీయం చేయోద్దని మిమ్మల్ని కోరుతున్నాం మేడం. ఇది రెజ్లర్ల నిరసన’’ అని టోక్యో ఒలింపిక్స్ బ్రోంజ్ మెడలిస్ట్ భజ్రంగ్ పునియా అన్నారు.


కాగా, గురువారం కేంద్ర ప్రభుత్వం నుంచి సందేశంతో వచ్చారు ఒలింపియన్ బబితా ఫోగట్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘నేను ముందుగా రెజ్లర్‭ని. ఆ తర్వాతే ఇంకేదైనా. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెజ్లర్లకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈరోజే తగిన చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను (రెజ్లింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషన్‭ మీద). నేను రెజ్లర్‭తో పాటు ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యమై ఉన్నందున మధ్యవర్తిగా ఉండడం నా భాధ్యత. వేధింపుల గురించి నా కెరీర్లో చాలా విన్నాను. నిప్పు లేనిదో పొగ రాదు. ఇప్పుడు వినిపిస్తున్న గొంతులు ఇలాగే వినిపించాలి, అది చాలా అవసరం’’ అని అన్నారు.

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు అదుపు చేయలేకపోతున్న సిబ్బంది