దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు ? ….. వివాదం రేపిన వీసీల ఎంపిక పరీక్షలో ప్రశ్న

  • Published By: murthy ,Published On : November 27, 2020 / 09:59 AM IST
దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు ? ….. వివాదం రేపిన వీసీల ఎంపిక పరీక్షలో ప్రశ్న

Written test in Raj Bhavan for Odisha VC aspirants : ఒడిషాలోని ఆరు యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ పోస్టుల నియామకానికి రాజ్ భవన్ లో నవంబర్22,ఆదివారం నాడు పరీక్ష నిర్వహించారు. ఎంపిక చేసిన యూనివర్సిటీ ప్రోఫెసర్లు ఈ పరీక్షకు హజరయ్యారు. ప్రశ్నా పత్రంలో  ఇచ్చిన ప్రశ్నలు చూసి చాలామంది ప్రొఫెసర్లు ఇబ్బందికి గురయ్యారు.

ఆ ప్రశ్నలు తమను అవమానించటమే అని వారు భావించారు. ఈప్రశ్నా పత్రంలోని ఒక ప్రశ్న ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. వాటిలో ఒక ప్రశ్న దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే మీరు ఏమి అడగాలనుకుంటున్నారు అని ఉంది.



ఎంపిక చేసిన 16 మంది ప్రొఫెసర్లకు ఛాన్సలర్ (గవర్నర్)తో ఇంటర్వ్యూ ఉంటుందని రాజ్ భవన్ కు పిలిపించారు. కానీ అనుకోని కారణాల వల్ల గవర్నర్ గణేష్ లాల్ భార్య సుశీలాదేవి ఆదివారం ఉదయం మరణించటంతో…..గవర్నర్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ మెహార్డా ప్రోఫెసర్లకు రాతపరీక్ష నిర్వహించారు.
https://10tv.in/vijayashanthi-facebook-profile-picture-change/
నాలుగు ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి 45 నిమిషాల్లో రాయమని చెప్పారని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక ప్రొఫెసర్ చెప్పారు. 16 మంది  అభ్యర్ధులకు ముగ్గురు ఇన్విజిలేటర్లు గదిలో ఉన్నారని మేము ఏమైనా మాట్లాడుకుంటామా…. అని వారు మమల్ని అబ్జర్వ్ చేసారని ఒకరు చెప్పారు. పరీక్షల తంతు హస్యాస్పదంగా సాగిందని, విద్యావేత్తలను సరిగా గౌరవించలేదని మరోక అభ్యర్ధి వాపోయారు. ఫలితాలను సాయంత్రం ప్రకటించారు.



ఎన్ఐటీ రూర్కెలా మాజీ డైరెక్ట్ర్ సునీల్ సారంగ్ మాట్లాడుతూ విద్యావేత్తలను గౌరవించాల్సి అవసరం ఉందని అన్నారు. ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ ను గౌరవిస్తే అతను యూనివర్సిటీలోని తన సహచరులను గౌరవంగా చూస్తాడని, ఉపాధ్యాయులు విద్యార్ధులతో బాగా ప్రవర్తిస్తారని లేకపోతే దీనికి విరుధ్ధంగా జరుగుతుందని తద్వారా యూనివర్సిటీల్లో అనారోగ్యకర వాతావరణం ఏర్పడుతుందని సారంగి అన్నారు.

అభ్యర్థులకు ఇచ్చిన నాలుగు ప్రశ్నలు చాలా అసంబధ్ధంగా ఉన్నాయని అభ్యర్ధులు అభిప్రాయపడ్డారు.
1. విశ్వం నిర్మించబడింది ….
2. విశ్వాన్ని నిర్మించడానికి విశ్వవిద్యాలయం పాత్ర?
3. మీకు పని అనుభవం ఉంది. పని చేసే శైలి? పని చేసే ఆత్మ?
4. దేవుడు మీ ముందు ప్రత్యక్షమై వరం కోరితే, మీరు ఏమి అడగాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు ఇచ్చారు.



దేవుడి గురించి అడిగిన ప్రశ్న చాలా ఇబ్బందికరంగా ఉందని ఒడిషా యూనివర్సిటీ నుంచి రిటైరైన ఒక ప్రొఫెసర్ అన్నారు. దేవుడికి సంబంధించి అడిగిన ప్రశ్నపై ప్రొఫెసర్లు పంపిన మెయిల్స్ కు ఇంతవరకు సమాధానం రాలేదని తెలిసింది.

కాగా ఒడిషాలోని ఆరు విశ్వవిద్యాలయాలు ఉత్కల్ విశ్వవిద్యాలయం, ఉత్తర ఒడిశా విశ్వవిద్యాలయం, ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం, రామదేవి మహిళా విశ్వవిద్యాలయం, ఖలీకోట్ విశ్వ విద్యాలయం మరియు గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయాలు ఎంపిక చేసిన 16 మంది పేర్లను గవర్నర్ కు సిఫారసు చేశాయి. ఇటీవల ఒడిషాలో విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను ఎంపిక చేసే విధానాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరించటంతో వివాదాలకు కారణం అయ్యింది.