Presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..? టీఎంసీకి రాజీనామా

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్ష నేతలు సమావేశంలో అయ్యారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

Presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..? టీఎంసీకి రాజీనామా

Yaswanth

Presidential election: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం శరద్ పవార్ నివాసంలో ప్రతిపక్ష నేతలు సమావేశంలో అయ్యారు. శరద్ పవార్ తో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రపుల్ పటేల్, జైరామ్ రమేష్, సీతారాం ఏచూరి, డి. రాజాలు భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం 2.30గంటలకు 17 ప్రతిపక్ష పార్టీల నేతలు మరోసారి పార్లమెంట్ అనెక్స్ లో సమావేశం కానున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకుంటారు.

Honey Trap: పాక్‌కు చేరిన భారత్ అణు రహస్యాలు..? డీఅర్డీఎల్ హనీట్రాప్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

ఈ విషయంపై శరత్ పవార్ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం సమావేశానికి అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరవుతారని భావిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉంటే ప్రతిపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని విపక్షాలు చేసిన విన్నపాన్ని ఆప్పటికే మహాత్మాగాంధీ మనవడు, బంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ సున్నితంగా తిరస్కరించారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా కూడా పదవికి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్​ సిన్హా పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. మధ్యాహ్నం జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

world’s Biggest Fish: ప్రపంచంలోనే అతిపెద్ద చేప గుర్తింపు.. ఎన్ని కేజీలంటే..

రాష్ట్ర పతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు యశ్వంత్ సిన్హా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా  చేస్తున్నట్లు  ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని యశ్వంత్ సిన్హా స్వయంగా ట్వీటర్ వేదికగా వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలకోసం, విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుంచి బయటకు రావాల్సిన సమయం తప్పనిసరి అని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బెంగాల్​ సీఎం మమతా బెనర్జీకి యశ్వంత్ సిన్హా కృతజ్ఞతలు చెప్పారు. యశ్వంత్​ సిన్హా మాజీ ఐఏఎస్‌ అధికారి. 1984లో జనతాదళ్‌లో చేరారు. తర్వాత భాజపాలో చేరారు. గత ఏడాది భాజపా నుంచి బయటకు వచ్చి తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. ప్రస్తుతం తృణమూల్‌ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.