వేర్పాటువాదంపై ఉక్కుపాదం : JKLFని బ్యాన్ చేసిన ప్రభుత్వం

వేర్పాటువాదంపై ఉక్కుపాదం : JKLFని బ్యాన్ చేసిన ప్రభుత్వం

వేర్పాటువాదంపై ఉక్కుపాదం : JKLFని బ్యాన్ చేసిన ప్రభుత్వం

పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే వేర్పాటువాద నేతలకు కల్పించిన సెక్యూరిటీని  ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రప్రభుత్వం ఇవాళ చట్టవిరుద్ద కార్యక్రమాల చట్టం 1967 సెక్షన్ 3(1) ప్రకారం వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF)పై నిషేధం విధించింది.

ఈ సంస్థపై ఇప్పటికే అనేక సీరియస్ కేసులు నమోదయ్యాయి. నలుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హత్య,వీపీ సింగ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ముఫ్తీ మహమద్ సయీద్ కూతురు డాక్టర్ రుబియా సయీద్ కిడ్నాప్ లలో ఈ సంస్థ పాత్ర ఉంది.ఉగ్రవాదులకు JKLF ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తేలింది.కాశ్మీర్ లోయలో పోలీసులపై రాళ్లు విసరేవాళ్లకు,వేర్పాటువాదులకు ఈ సంస్థ ఆర్థికసహకారం అందించేది.

ఈ సంస్థ కార్యక్రమాలు దేశ భధ్రతకు తీవ్ర ముప్పుగా ఏర్పడటంతో JKLF పై నిషేధం విధిస్తూ శుక్రవారం కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది.చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వేర్పాటువాదులపై ఉక్కుపాదం మోపిన పోలీసులు మార్చి-24,2019న జమాతే ఇస్తామి(కాశ్మీర్),హురియత్ కాన్ఫరెన్స్ కి చెందిన 130మంది వేర్పాటువాదులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అరెస్ట్ అయిన వారిలో జేకేఎల్ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్,జమాతే ఇస్లామీ చీఫ్ అబ్దుల్ హమిద్ ఫయజ్ కూడా ఉన్నారు. ఉగ్రవాద గ్రూప్ లతో టచ్ లో ఉన్నారని ఈ నెల మొదట్లో కేంద్రహోంమంత్రిత్వ శాఖ జమాతే ఇస్లామి సంస్థను బ్యాన్ చేసింది.
 

×